Wednesday, May 1, 2024

అందుబాటులో లేని సిజెఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ శుక్రవారం కోర్టు నిర్వహించడం లేదని సుప్రీంకోర్టు ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రధాన న్యాయబూర్తి నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం నాడు పలు ముఖ్యమైన కేసులను విచారించాల్సి ఉంది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించిన కేసు కూడా వీటిలో ఉంది. ‘గౌరవనీయులైన భారత ప్రధాన న్యాయమూర్తి జులై 28న( శుక్రవారం కోర్టు నిర్వహించడం లేదు.

అందువల్ల ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ రద్దయినట్లుగా భావించాలి. ఈ బెంచ్ ముందు లిస్టయిన విషయాలు విచారణకు స్వీకరించబడవు కనుక వాయిదా పడినట్లు భావించాలి’ అని సుప్రీంకోర్టు ప్రకటన తెలిపింది.సుప్రీంకోర్టులో అందరికన్నా సీనియర్ అయిన జస్టిస్ ఎస్‌కె కౌల్ నేతృత్వంలోని మరో బెంచ్ ముందు అత్యవసర కేసులను పేర్కొనడం జరుగుతుందని కూడా ఆ ప్రకటన తెలిపింది. సిజెఐ చంద్ర చూడ్ గురువారం కూడా అందుబాటులో లేరు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసును సిబిఐకి బదిలీ చేస్తామని గురువారం కోర్టుకు సమర్పించినతన సమాధానంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ సమాధానాన్ని సిజెఐ నేత్తత్వంలోని బెంచ్ శుక్రవారం పరిశీలించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News