Sunday, April 28, 2024

శుద్ధజలంతో ఆరోగ్యానికి మేలు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దళిత కాలనీవాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్దజల కేంద్రంను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు దళిత నాయకులు డప్పు చప్పుళ్లతో ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శుద్దమైన మంచినీరు ఎంతో మేలు చేస్తుందన్నారు.

ఈ కాలనీలో ప్రజలంతా కూడా తమ ఆరోగ్యమే ముఖ్యమని, ఏదున్నా లేకున్నా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఎంత డబ్బున్నా ఎన్ని ఆస్తులున్నా ఆరోగ్యం లేకపోతే ఆది వ్యర్థమే అన్నారు. ఈ కాలనీ వాసులు తమకు తామే డబ్బులు జమ చేసుకొని శుద్ద జల కేంద్రం ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు.

అలాగే గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.45 లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. అలాగే రైల్వే గేటు మూసి వేయడంతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలుపడంతో పుట్ పాత్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. దళిత కాలనీలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు సహకరిస్తానన్నారు. పెద్దపల్లి నుండి కొత్తపల్లి మీదుగా ఓదెల వరకు రూ.36 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణంకు నిధులు వచ్చాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బొంకూరు శంకర్, సింగిల్ విండో చైర్మన్ మాదిరెడ్డి నరసింహరెడ్డి, సర్పంచ్ సత్యం, ఎంపీటీసీ సాయికృష్ణ, గ్రామ అధ్యక్షుడు కలవేన సతీష్, నాయకులు ఎలబోతారం శంకర్, మెట్టు సమ్మయ్య, దళిత నాయకులు పల్లె సదానందం, పెర్క శివ, శంకర వరప్రసాద్, పెరక హన్మంతు, పల్లె విజయ్, పెరక కనకయ్య, పెర్క వంశీకృష్ణ, పెర్క రాజేందర్, జోగు రాజు, కనుకుంట్ల సదానందంతోపాటు పలువురు పాల్గన్నారు. అలాగే దళిత కాలనీలో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. శుద్ద జలం పక్కనే స్థలం చూపడంతో ఎమ్మెల్యే కొబ్బరి కొట్టి పనులు ప్రారంభించాలని వారికి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News