Monday, May 13, 2024

యానిమేషన్ కంపెనీ డిక్యు ఎంటర్‌టైన్‌మెంట్ మూసివేత

- Advertisement -
- Advertisement -

Closure of Animation company DQ Entertainment

 

రోడ్డున పడ్డ 1400 మంది ఉద్యోగులు

మనతెలంగాణ/హైదరాబాద్ : నగరంలో ప్రముఖ యానిమేషన్ కంపెనీ డిక్యు ఎంటర్‌టైన్‌మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ తన కార్యాలయాన్ని మూసివేసింది. ఈక్రమంలో దివాలా తీసినట్లు కోర్టులో ఆ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న 1400 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గత ఎనిమిది నెలల నుంచి ఈ సంస్థ తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించ లేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులు, మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. సంస్థపై సిసిఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎండి తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్కొక్కరికి రూ.14లక్షల వరకు రావాలని ఉద్యోగులు తెలిపారు. తమ వేతనాలు అడిగితే వేధింపులకు , బెదిరింపులకు పాలుపడుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News