Tuesday, May 14, 2024

పేద విద్యార్థులు ట్యాబ్‌లు పట్టుకుంటే చంద్రబాబు చూడలేరు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియాలో చదువుకుంటే మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు నచ్చదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా క్రోసూరులో సిఎం జగన్ మోహన్ రెడ్డి నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక అందించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. పేద విద్యార్థులు ట్యాబ్‌లు పట్టుకుంటే చంద్రబాబు చూడలేరన్నారు. చంద్రబాబుకు పేదలంటే వ్యతిరేకమన్నారు. పేదల చదువుల కోసం అడుగులు వేస్తున్న మీ మేనమామ ప్రభుత్వం అని జగన్ ప్రశంసించారు.

Also Read: భూమన వర్గీయుల అరాచకం… ఫేస్‌బుక్ కామెంట్… కిడ్నాప్

చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం అని మండిపడ్డారు. చంద్రబాబు బతుకంతా వాగ్ధానాలు తరువాత వెన్నుపోట్లు అని, మోసాల చక్రమే టిడిపి సైకిల్ చక్రం అని జగన్ ఎద్దేవా చేశారు. దుకాణం మూసేయడానికి టిడిపి సిద్ధంగా ఉందని, బాబు పులిహోర మ్యానిఫెస్టో తెచ్చారని, బిసి, ఎస్‌సి, ఎస్‌టి డిక్లరేషన్ అంటూ బాబు డ్రామాలు మొదలు పెట్టారని జగన్ చురకలంటించారు. 14 ఏళ్లు సిఎంగా ఉండి బాబు ఏం చేశారని, గాడిదలు కాశారా? అని అడిగారు. మరో బాబు మోసానికి తెరతీశారని దుయ్యబట్టారు. బాబు పెత్తందారీ భావజాలానికి-పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని, సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News