Sunday, May 5, 2024

రేపు ప్రగతిభవన్ లో సిఎం ఉన్నతస్థాయి సమీక్ష

- Advertisement -
- Advertisement -

CM decides to start registration of Non-Agriculture land

హైదరాబాద్: సిఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ రేపు సమీక్షించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని సిఎం నిర్ణయించారని తెలంగాణ సిఎంవొ వెల్లడించింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలి..? అనే విషయాలు చర్చించడానికి సిఎం కెసిఆర్ ఆదివారం ఉదయం 11గంటలకు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు. సిఎస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొనున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను విజయవంతం చేయాలని, వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం దేశంలో ఎక్కడా ఇలాంటి పోర్టల్‌ లేదని కెసిఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలిపారు.

CM decides to start registration of Non-Agriculture land

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News