Tuesday, May 21, 2024

అభినవ అంబేడ్కర్ కెసిఆర్: బాల్క సుమన్

- Advertisement -
- Advertisement -

Balka Suman comments on BJP leaders

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు పథకం అమల్లోకి వచ్చిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు. దళిత బంధు పథకం ద్వారా వాసాలమర్రి దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భంగా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న అభినవ అంబేడ్కర్ కెసిఆర్ అని ప్రశంసించారు. దశాబ్దాలుగా వెనుకబడిన దళిత జాతి అభ్యున్నతికి కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి కెసిఆర్ అని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News