Wednesday, May 15, 2024

అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితబంధు: మాణిక్ రావు

- Advertisement -
- Advertisement -

Ambedkar ideals in Dalit bandhu

హైదరాబాద్: దళితబంధు పథకం అమలు కావడం సంతోషంగా ఉందని జహీరాబాద్ ఎంఎల్‌ఎ మాణిక్ రావు ప్రశంసించారు. దళిత బంధు పథకం ద్వారా వాసాలమర్రి దళితులకు పది లక్షల రూపాయలు ఇచ్చిన సందర్భంగా మాణిక్ రావు మీడియాతో మాట్లాడారు. 70 ఏళ్లుగా దళితుల అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోలేదని, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితబంధు ఉందన్నారు. గత పాలకులు దళితుల అభివృద్ధిపై ప్రకటనలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం దళితబంధు నిధులు ఇచ్చారని, ఆర్థికంగా, సామాజికంగా దళితులను అభివృద్ధి చేయాలన్నదే సిఎం సంకల్పమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News