Thursday, May 2, 2024

హారన్

- Advertisement -
- Advertisement -

CM KCR press meet on Lockdown relaxations

 

కంటైన్మెంట్లు తప్ప రాష్ట్రమంతా గ్రీన్‌జోన్
నేటి నుంచి జిల్లాల మధ్య బస్సులు
జిల్లాల నుంచి హైదరాబాద్ జెబిఎస్ వరకు ఆర్‌టిసి
ఆటోలు(1+2), ట్యాక్సీ, ప్రైవేటు కార్ల(1+3)కు అనుమతి
కంటైన్మెంట్లలో తప్ప దుకాణాలు, హెయిర్ సెలూన్లకు ఒకే
ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు, పరిశ్రమలూ, ఇ-కామర్స్ ఓపెన్
హైదరాబాద్‌లో సిటీ బస్సులు, మెట్రోకు నో
రాజధానిలో సరి, బేసి విధానంలో దుకాణాలు తెరవాలి

బార్లు, పబ్‌లు, మాల్స్, థియేటర్లు, జిమ్‌లు, పార్కులు, ఫంక్షన్ హాళ్లు, సామూహిక మత ప్రార్థనలు, సభలు, సమావేశాలపై నిషేధం

నేటి నుంచి జిల్లాల మధ్య బస్సులు
జిల్లాల నుంచి హైదరాబాద్ జెబిఎస్ వరకు ఆర్‌టిసి
ఆటోలు(1+2), ట్యాక్సీ, ప్రైవేటు కార్ల(1+3)కు అనుమతి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. అలాగే తెలంంగాణలోనూ ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి రాష్ట్రంలో అన్ని రకాల దుకాణాలు తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అయితే కంటైన్మెంట్ జోన్‌లో మాత్రం ఎలాంటి అనుమతులు లేవన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుందని సిఎం తెలిపారు. అన్ని రకాల పరిశ్రమలను తెరుచుకునేందుకు, ఆర్‌టిసి బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ఈ..కామర్స్ రంగాలకు అనుమతులు ఇస్తున్నట్లు వెల్లిండించారు. సోమవారం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరిగింది. లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, సడలింపులపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎన్ని రోజులు ఉంటుందో…. ఎప్పుడు పూర్తిస్థాయి వ్యాక్సిన్ వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ నేపథ్యంలో కరోనాతో కలసి జీవించడం నేర్చుకోని…. ముందుకు సాగాల్సిందేనని పేర్కొన్నారు. లాక్‌డౌన్ సడలించామని అని చెప్పి రోడ్లపైకి వచ్చి హంగామా చేయొద్దని ప్రజానీకానికి కెసిఆర్ హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1452 కుటుంబాలు కంటైన్మెంట్ జోన్‌లో ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతంలో మాత్రం లాక్‌డౌన్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. ఇంట్లో ఉన్న వ్యక్తులు బయటకు రాకుండా…బయటి వారి లోనికి వెళ్ళకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఆ ప్రాంతాల్లో నిరంతర పోలీసుల పహారా ఉంటుందని సిఎం కెసిఆర్ తెలిపారు. ఆ ప్రాంతంలోని ప్రజలు కావాల్సిన నిత్యవసర వస్తువులు, మందులు ఇతర సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చు అని తెలిపారు. హైదరాబాద్ నగరంలో సరిబేసి విధానంలో దుకాణాలు తెరవాలన్నారు. అన్ని రకాల విద్యాసంస్థల బంద్ కొనసాగుతుందని సిఎం వివరించారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి బస్సులు తిరుగుతాయన్నారు. అంతరాష్ట్ర బస్సులను మాత్రం అనుమతించడం లేదన్నారు. అలాగే మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా బస్సులను నడపమన్నారు. కాగా జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులు ఇమ్లీబన్ బస్టాండ్‌కు కాకుండా..జూబ్లీ బస్‌స్టాండ్‌కు అనుమతిస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిటీ బస్సులు మాత్రం ఇప్పట్లో నడవన్నారు. అయితే హైద్రాబాద్‌లో ఆటోలు…టాక్సీలు షరతులతో నడుస్తాయని సిఎం తెలిపారు. ఆటోలో డ్రైవర్‌తో మరో ఇద్దరు, టాక్సీలో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు.

నియమాలను పాటిస్తూ తెరుచుకోవచ్చు

నేటి నుంచి రాష్ట్రంలో అన్ని రకాల షాపులను తెరుచుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. కటింగ్ షాపులు, ఈ కామర్స్‌తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ తెరుచుకోవచ్చునని వెల్లడించారు. అయితే ఫంక్షన్ హాల్, మాల్స్, సిని మా హాళ్లు మాత్రమే నడవవని తెలిపారు. అలాగే ఎ లాంటి సభలు, సమావేశాలు, విద్య సంస్థలు, బార్లు, స్విమింగ్ పూల్స్, జిమ్, పార్కులు, మెట్రోరైల్ సర్వీసులు కూడా నడిపిచేందుకు అనుమతి లేదన్నారు.

మాస్క్ ధరించపోతే రూ.1000ల జరిమానా

ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని… లేదంటే రూ. 1000 జరిమానా కట్టాల్సి ఉంటుందని సిఎం కెసిఆర్ మరోసారి హెచ్చరించారు. కరోనాను జయించేందుకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ స్వీయ నియంత్రణలో ఉంటాలని సూచించారు. అలాగే ప్రతి షాపులో డి కోవిడ్ నియమాలు పాటించాలన్నారు. శానిటేషన్ బాటిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో తప్ప కుటుంబ సభ్యులు తమ చిన్నారులను, 65 సంవత్సరాలు దాటిని వృద్ధులను ఇంట్లో నే ఉండే విధంగా చూడాలన్నారు.

ప్రార్థనా మందిరాలు బంద్

లాక్‌డౌన్ ముగిసేంత వరకు రాష్ట్రంలో అన్ని కులాలు, వర్గాలకు చెందిన ప్రార్థన మందిరాలను బంద్ చేసే ఉంటాయని సిఎం కెసిఆర్ తెలిపారు. జిల్లాలకు చెందిన బస్సులు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైదరాబాద్ పరిధిలో సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతిలేదని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News