Sunday, April 28, 2024

ఆంక్షల సడలింపుపై సమీక్ష

- Advertisement -
- Advertisement -

 

రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది ?
కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో కట్టుదిట్టమైన చర్యలు
తాజా పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్ ఆరా

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు, మూడు జిల్లాల్లో మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ నియంత్రణలో ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల దాని ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెడ్ జోన్‌లో ఉన్న ప్రాంతాలు మినహా ఇతర జిల్లాల్లో ప్రజా జీవనాన్ని తిరిగి పట్టాలు ఎక్కించాల్సిన అవసముందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించారన్నారు. ఇక ముందు కూడా లాక్‌డౌన్ నిబంధనలతో ముందుకు సాగాల్సిన అవసముందన్నారు. ఈ విషయంలో ప్రజల్లో కూడా కొంత మేర చైతన్యం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేస్తే? దాని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై కూడా సిఎం కెసిఆర్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.

శనివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన తరువాత పరిస్థితిలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి? రాత్రివేళల్లో కర్వూ నిబంధలను సక్రంగా అమలు జరుగుతున్నాయా? వసల కార్మికులకు వారి సొంత ఊళ్ళుకు వెళ్ళేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మద్యం విక్రయాలతో పాటు రైతులకు సంబంధించిన పలు అంశాలపై సిఎం కెసిఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. కరోనా కథ ఇప్పట్లో ముగిసే విధంగా కనిపించే సూచనలు కనిపించడం లేదని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. కరోనాతో మరికొంత కాలం సహజీవనం చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అధికార యంత్రాంగమంతా సిద్దం కావాలన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలన్నారు. ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధానను ఇస్తుందన్నారు.

అదే సమయంలో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సిఎం అన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో జిహెచ్‌ఎంసి పరిధిలో జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయని సిఎం పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో కేసుల నమోదు శాతం చాలా తక్కువన్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా బాధితుల డిశ్చార్జి కేసుల సంఖ్య కూడా పెరుగుతుండడం శుభసూచకమన్నారు. ఈ నెల 15వ తేదీన మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష చేసి మరికొన్ని రంగాలకు ఆంక్షలకు సడలించే విషయంపై కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం మద్యం విక్రయాలతో రాష్ట్రానికి ఖజానా వస్తున్నప్పటికీ ప్రజలు భౌతిక దూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

మాస్కులు లేకుండా బయటకు వచ్చినా…. ప్రజలు గంపులు, గుంపులుగా ఉన్న అధికారులు ఊపేక్షించకూడదని డిజిపికి సూచించారని తెలుస్తోంది. ఈ విషయంలో పోలుసు శాఖ కొంత నిక్కచ్చిగానే వ్యవహరించాలని సూచించారు. కాగా కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ సాధ్యమైనంత త్వరగా ముగించాలని సూచించారు. అలాగే అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని సమాచారం. ఈ సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News