Friday, May 3, 2024

విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పదు: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Specch

హైదరాబాద్: విద్యుత్ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. శుక్రవారం శాసనసభలో పల్లె ప్రగతిపై జరిగిన లఘు చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పేదలకు భారం లేకుండా విద్యుత్ ఛార్జీలు పెంచుతామన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటే కొంత పన్నుల భారాన్ని మోయకతప్పదని  కెసిఆర్ స్పష్టం చేశారు. అయితే నిరుపేదలపై తమ ప్రభుత్వం పన్నుల భారం మోపదన్నారు. పన్నులను మోయగలిగే వర్గాలపైనే ఛార్జీల భారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో గ్రామాలు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాలంటే ఆస్తిపన్ను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. పన్నుల భారాన్ని మోపుతున్నట్లు ప్రజలకు చెప్పే ధైర్యం మాకుందన్నారు. ఓట్ల కోసం భయపడే పరిస్థితిలో తాము లేమన్నారు. ప్రజలకు మాపై విశ్వాసం ఉండేలా పాలన అందిస్తున్నామన్నారు.

లే అవుట్‌ల అనుమతులు కలెక్టర్లకు తప్ప మరెవరికి లేదన్నారు. ఇంటి కొలతలు ఇకపై యజమానులే సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా అందిస్తారన్నారు. ఇంటి యజమానులు అందించిన లెక్కల ప్రకారమే పన్నుల విధింపు ఉంటుందన్నారు. ప్రజలపై తమకు నమ్మకం ఉందన్నారు. వాళ్లు నిజాలు చెబుతారనే ఆ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. అసత్యపు లెక్కలు ఇచ్చిన వారికి 25 రెట్లు జరిమానాతో పాటు రెండేళ్ళ పాటు జైలు జీవితం కూడా గడపాల్సి ఉంటుందని సిఎం కెసిఆర్ హెచ్చరించారు.

CM KCR Speech on Palle Pragathi in Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News