Sunday, May 5, 2024

నేడు మహారాష్ట్రకు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన దళితనేత, సామాజిక వేత్త అన్నాబావ్ సాఠే జయంతి ఉత్సవాల్లో సిఎం కెసిఆర్ పాల్గొంటారు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 10.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 11.15 నిమిషాలకు కొల్లాపూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 11.45 గంటలకు అంబబాయి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

అనంతరం మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా వార్వా తహశీల్ వాటేగావ్ గ్రామంలో జరిగే అన్నాభౌ సాఠే 103వ జయంతి ఉత్సవాల్లో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పాల్గొంటారు. 12.45 నిమిషాలకు అన్న భావ్ సాతే విగ్రహానికి నివాళులు అర్పించి, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నా భావ్ సాతే కుటుంబ సభ్యుల ఇంటికి చేరుకుంటారు. 1.30 గంటలకు ఇస్లాంపూర్ లోని రఘునాథ్ దాదా పాటిల్ ఇంట్లో అందరితో కలిసి భోజనం చేస్తారు. అన్నాబావ్ సాఠే స్మృతి దివస్‌లో పాల్గొన్న తరువాత బిఆర్‌ఎస్ అధినేత అక్కడి నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. సాయంత్రం 5 గంటలకు సిఎం కెసిఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News