Thursday, August 7, 2025

మా పోరాటాన్ని పూర్తి చేశాం.. ఇక, అంతా బిజెపి చేతిలోనే: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

42 శాతం బిసి రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో చేపట్టిన ధర్నా అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిసి రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలన్నది మా కమిట్మెంట్ అని.. దానికి మా ఆఖరి పోరాటాన్ని నిన్నటితో పూర్తి చేశామని అన్నారు. కులగణన, రిజర్వేషన్ల సాధనలో మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరన్నారు. బిసిలపై ప్రేమ ఉంటే.. కేంద్రం వెంటనే బిల్లును ఆమోదించాలన్నారు. జంతర్ మంతర్ వేదికగా మా వాయిస్ ను బలంగా వినిపించామని, బిల్లుపై ఇక బిజెపి పార్టే నిర్ణయం తీసుకోవాలన్నారు. మా కమిట్మెంట్ కు విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదని.. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం బిఆర్ఎస్ నైజమని విమర్శించారు. ఒకవేళ బిసి బిల్లును కేంద్రం ఆమోదించకపోతే.. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచిస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News