Tuesday, May 7, 2024

ఆందోళనలో వేతన జీవులు

- Advertisement -
- Advertisement -
Commodity prices are rising
పెరుగుతున్న ధరలు.. పెరిగని ఆదాయం

హైదరాబాద్: కరోనా కేసులు తగ్గుముఖం పడుతన్న సమయంలో లక్షలాది మందికి ఉపాధినిచ్చే నగరంలో పనులు తగ్గిపోయాయి. సరిపడా పనులు లేక వేలాది మందికుటుంబాలు బతుకులు రోడ్డును పడుతున్నాయి. ఆదాయం తగ్గుపొయింది. ఖర్చులు రెట్టింపు కోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కరోనా నష్టం పేరుతో ప్రతి వస్తువును రెట్టింపు చేసిన అమ్ముతున్నారు. ఆదాయం లేక కోనుగోలు శక్తి సన్నగిల్లిపోవడంతో ఉన్నదాంతో సర్దుకు పోతున్నారు. అవసరం అనుకుంటే ఒక పూట భోజనంతో బతుబండి లాగిస్తున్నారు. కరోనాత తర్వాత సామాన్య మధ్యతరగతి వారి ఆదాయం తగ్గిపోయింది. పెరుగుతున్న ఖర్చులతో జీవనం బతుకు చిత్రం మారిపోయింది. ఎన్నో కుటుంబాలకు బతుకునిచ్చిన నగరం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

సంవత్సరన్నర కాలంగా ఏర్పడిన పరిస్థితులతో బతకులు ఆగమాగంమవుతున్నాయి. దమ్మిడి సంపాదన లేక పోయినా ఖర్చులు మాత్రం రెట్టింపు అవుతున్నాయి. నగరంలో పనులు లేక బతుకులు ఈడ్చలేక కొంత మంది ంత గ్రామాలకు వెళుతుంటే ఉన్న వారికి పని చేసినా సంతృప్తికరమైన ఆదాయం లభించడం లేదు. కరోనా వైరస్ అనంతరం నగరంలో అన్ని రంగాల్లో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రోజువారి కూలి చేసుకుని బతుకులు వెళ్ళదీసే సామాన్యుడి జీవనం భారంగా మారింది. ఇప్పడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నా..న్నాయి. ఏడాదిన్నర కాలంలో జరిగిన నష్టాలను పూడ్చుకునేందుకు సదరు వ్యాపార, వాణిజ్య సంస్థలు కార్మికులు తగ్గించడమే కాకుండా, వేతనాల్లో కూడా కోతలు పెడుతుండటంతో సామన్యడి జీవితాలను అతలాకుతం చేస్తోంది. వేతన జీవులకు సరిపడా వేతనం లేక పోవడంతో బతుకబండి నడపడం చాలా కష్టంగా మారింది.

కష్టకాలంలో ఆదుకోవాల్సి ప్రభుత్వాలు ఒక చేత్లో ఇచ్చి మరో చేత్తో గుంజుకుంటున్నాయి. సంక్షేమ పథకాలు, ఉచిత బియ్యం ఇస్తున్నా ,పెరుగుతున్న పెట్రోల్ ,గ్యాస్ ధరలు, ఇతర పున్నుల రూపంలో వెళ్ళిపోతున్నాయి. ధరలను నియంత్రించాల్సిన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తాము చేసిన తప్పులను సరిద్దుకునే ప్రయత్నాలు చేయక పోవడంతో పరిస్థితులు దిగజారి పోతున్నాయి. కష్టజీవే కాకుండా యవజనులు సైతం నష్టాల బాట పడుతున్నారు. లాక్‌డౌన్, కరోనా ప్రభావంతో వచ్చిన నష్టాలకు పెరుగుతున్న డీజిల్,పెట్రోల్,గ్యాస్ ధరలు తోడు కోవడంతో దాని ప్రభావంర రవాణాఖర్చుల మీద పడుతోంది.దీన్ని ఆదసరా చేకుని ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి.గత సంత్సరంలో ఉన్న ధరలను ఈ సంవత్సరంతో పోల్చి చూస్తే సామాన్యుడి ఆర్దిక పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News