Sunday, April 28, 2024

ఐరోపా జిఐతో బిజెపికి పోలికలు!

- Advertisement -
- Advertisement -

Comparisons of BJP with European GI!

 

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్‌ లో ‘ఐడెంటిటేరియన్’ జాత్యహంకార ఉద్యమం మొదలయింది. ఇది శ్వేత జాతీయులను, క్రైస్తవులనే యూరోపియన్లుగా గుర్తిస్తుంది. బలహీనపడ్డ ఈ తిరోగమన్ సంస్థ ‘జాతి గుర్తింపు (జనరేషన్ ఐడెంటిటి-జిఐ)’ గా 9 ఏళ్ళ క్రితం పునరుద్ధరించబడింది. ఐరోపాలో వేగం గా పుంజుకుంటున్న తీవ్ర మితవాద సంస్థల్లో ఇది ముఖ్యమైంది. ఇటలీ, ఆస్ట్రియా, జర్మనీ, బ్రిటన్ సంయుక్త రాజ్యం (ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లండ్) లతో సహా పలు ఐరోపా దేశాల్లో దీని శాఖలున్నాయి. వేలల్లో క్రియాశీల కార్యకర్తలు, లక్షల్లో అనుచరులున్నారు. ముస్లింలు, వలసదారులు ఐరోపాను ఆక్రమించారని వీరి వాదన. వీరి నుండి యూరోపియన్ శ్వేతజాతి, సంస్కృతుల రక్షణ మా సంస్థ లక్షమంటారు. మాది అహింస, జాతి రహిత దేశభక్తి ఉద్యమమని ప్రకటించుకున్నారు. మన దేశంలో మహాత్మా గాంధీని చంపిన సంఘ్, సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతానని, రాజకీయాల్లో జోక్యం చేసుకోనని నాటి కేంద్ర గృహ మంత్రి వల్లభ్ పటేల్ కు హామీ ఇచ్చి తన రద్దును రద్దుచేయించుకుంది.

జిఐ హింసాత్మక జాతివాద సంస్థ. ఫ్రాంస్ ఉత్తర ప్రాంత నగరం లిలెలో ఫ్లాండర్స్ శాఖ నాయకుడు, సిటాడెల్లె బార్ నిర్వాహకుడు ఆరెలీన్ వర్హాసెల్ విస్ఫోటన పదార్థాలు నిల్వచేశాడు. బాలురపై దాడి చేశాడు. ఈ నేరానికి 5 నెల్ల జైలు శిక్షపడింది. 30 ఏళ్ళ తీవ్రవాది రెమి ఫలిజె ముస్లింల హత్య నా జీవిత లక్ష్యం అన్నాడు. పచ్చి బూతులు మాట్లాడుతూ మనం ఫ్రాంస్‌లో ఉన్నది స్వారీ చేయటానికి అన్నాడు. ఒక ముస్లిం అమ్మాయిని తీవ్రంగా గాయపరిచాడు. అమ్మాయి అయిన ఆమె ముస్లిం. అందుకే కొట్టానన్నాడు. వలసదారులను, వారి వారసుల దేశాలకు పంపటం తమ లక్ష్యమని 2017 ఐరోపా అధ్యక్ష ఎన్నిక విధాన పత్రంలో జిఐ ప్రకటించింది. తమ దేశీయులను తీసుకుపొమ్మని వలస దేశాలను వత్తిడి చేస్తామని జిఐ నాయకుడు జీన్ డేవిడ్ క్యాటిన్ ప్రకటించాడు.

ఫ్రాంస్ మితవాద తాత్విక పరిశోధన్ పాత్రికేయుడు మాథియస్ దెస్తాల్, ఈ భావం ఆర్‌ఎస్‌ఎస్. జాతి శుద్ధీకరణను పోలిన వెర్రి ఆలోచనన్నాడు. శరీర ఛాయ్, సంస్కృతిని బట్టి ఫ్రెంచ్ వారు కారని నిర్ణయించినవారిని దేశం నుండి బహిష్కరించాలని ఈ సంస్థ సభ్యుల ఆకాంక్ష. మన సంఘ్ ప్రభుత్వం పొరుగు దేశాల నుండి వలస వచ్చిన హిందువులను, సిక్కులను అనుమతించింది. ముస్లింలను వాపసు పొమ్మంటున్నది. ‘పౌర జాతీయ జాబితా’ లాంటి జిమ్మిక్కులు చేస్తున్నది. ఆర్య జాతీయులు మాత్రమే ఈ దేశంలో ఉండాలని సంఘీయుల కోరిక. ఫ్రాంస్ పశ్చిమ ప్రాంత నగరం పోయిటీర్స్‌లో, 2012లో, జిఐ ఒక మసీదును ఆక్రమించి పోలీసు జోక్యంతో వదిలేసింది. బహుళ సంస్కృతిపై యుద్ధం ప్రకటించింది. ముస్లిం వలసల రెఫరెండం కోరింది. 18 కోట్ల ఇల్లులేని వారున్న ఇండియాలో ఒక పౌరాణిక కల్పిత పాత్ర ఇంటి కోసం 6.12.1992 న అయోధ్య బాబ్రీ మసీదును సంఘ్ కూల్చింది. జిఐ తాత్వికత లాగే ఒకే జాతి, ఒకే సంస్కృతి సంఘ్ సిద్ధాంతం.

2017లో ఐరోపా రక్షణ సాకుతో మధ్యదరా సముద్ర శరణార్థ రక్షణ నౌకలను జిఐ అడ్డుకుంది. ఈ సందర్భంగా ప్రజల నుంచి బలవంతంగా రూ.42.5 లక్షలు వసూలు చేశారు. 2018 ఏప్రిల్‌లో వలసలు జరుగుతున్నాయన్న నెపంతో ఫ్రాంస్, -ఇటలీ సరిహద్దు మంచు పర్వత కనుమను మూసే ప్రయత్నం చేశారు. వంతులవారీ కాపలా కాస్తూ ‘ఫ్రాంస్ మీ ఇల్లు కాదు. మీ దేశాలకు తిరిగిపోండి’ అన్న నినాదంతో జండా పాతారు. ఫ్రెంచ్ రాజకీయ విశ్లేషకులు రాబర్ట్ డిఏంజలో జిఐ దాడులను ‘బందిపోటు దొంగల యుద్ధం’ గా వర్ణించారు. జనాల నోళ్ళలో నానుతూ ఉండటం, రాజకీయ ప్రచారం వీరి ఉద్దేశం. తమ చర్యలను మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటారు. వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తారు. ఈ పనులు మన గో గూండాల దాడులు, వాటి వీడియో ప్రచారాలను తలపిస్తున్నాయి. అండగా ఉన్నామని అస్మదీయులకు హామీ ఇవ్వటం, తస్మదీయులను బెదిరించి లొంగదీసుకోడం సంఘ్ ఉద్దేశం.

ఫ్రాంస్ మితవాద రాజకీయ పార్టీ నేషనల్ ఫ్రంట్ (ఎన్.ఎఫ్.) కు జిఐ అనుబంధ సంస్థ. బిజెపి, ఆర్.ఎస్.ఎస్.ల లాగా ఫ్రెంచ్ సమాజంలో తన జాత్యహంకార ఆలోచనలను కప్పిపుచ్చుకోటానికి జిఐ రూపం మార్చుకుంది. ముస్లింల బహిష్కరణకు కంకణం కట్టుకున్న జిఐ మేము పర్యావరణ పరిరక్షకులమని ప్రచారం చేసుకుంటుంది. తమ ‘ఆదర్శ’ రూప ప్రదర్శనకు సారా అంగళ్ళు, క్రీడా ప్రాంగణాలు నిర్వహిస్తుంది. (మన గుళ్ళల్లో ధర్మపిండాలు పెట్టినట్లు) పేదలకు ఆహారం పంచుతారు. సారా అంగళ్ళలో ప్రాంతీయ తత్వాన్ని బోధిస్తారు. పరివార సంస్థల్లో హిందు మతోన్మాదాన్ని, ముస్లిం, క్రైస్తవ, కమ్యూనిస్టు వ్యతిరేకతలను రుద్దినట్లు. నల్లజాతి ప్రజలు, అరబ్బుల నుండి రక్షణ పేరుతో బాక్సింగ్ తరగతుల్లో మల్ల యుద్ధం నేర్పుతారు. సంఘ్ అనుబంధ సంస్థ ధర్మసేన శిక్షణల్లో యుద్ధ విద్యలు, ఆధునిక ఆయుధ సాధనలు నేర్పినట్లు. జిఐ సేవలు శ్వేతజాతీయులకే. సంఘ్ సహాయక కార్యక్రమాలు హిందుత్వవాదులకే. ఈ పనుల్లో జిఐ సామాజిక మాధ్యమాల ద్వారా విపరీత రాజకీయ లబ్ధి పొందుతోంది. ట్రంప్ అధికారం పొందటానికి సాయపడిన అమెరికా ‘ఆల్ట్-రైట్’ సంస్థ లాంటిది జిఐ. 2017 లో మధ్యదరా సముద్రంలో వలసదారులను కాపాడిన స్వచ్ఛంద సేవకులను మానవ అక్రమ రవాణ వ్యాపారులని ప్రచారంచేశారు. స్మగ్లర్లకు సాయం చేస్తోందని జర్మన్ స్వచ్ఛంద సంస్థ ‘లైఫ్‌టైం’ ను అధ్యక్షుడు మెక్రాన్ నిషేధించారు.

తమ భావజాలాన్ని సమర్థించని, అసహాయులకు సహకరిస్తున్న స్వచ్ఛం ద సేవా సంస్థలను సంఘ్ ప్రభుత్వం నిషేధించింది. సంఘ్ తాత్విక్ సంస్థ (థింక్ టాంక్) వివేకానంద ఫౌండేషన్ బిజెపికి అందించినట్లు జిఐ ఎన్.ఎఫ్.కు నాయకులను అందించింది. ఎన్. ఎఫ్. నాయకుడు మెరైన్ లే పెన్ సలహాదారుడు, ప్రఖ్యాత జిఐ వ్యవస్థాపక కార్యకర్త ఫిలిప్ వార్డాన్ వారిలో ఒకరు. బిజెపి ప్రభుత్వం తమ థింక్ టాంకుల నాయకులను ప్రజాస్వామ్య, రాజ్యాంగ, రాజ్యాంగేతర, విద్యాసాంస్కృతిక సంస్థల అధిపతులుగా నియమించింది.

ఫ్రెంచ్ ప్రజలు పాలక నిరంకుశత్వాన్ని తీవ్రంగా నిరసించారు. గట్టిగా ఉద్యమించారు. ఘన విజయాలు సాధించారు. ఇతర ఐరోపా దేశాలు గ్రీస్, ఇటలీ, బ్రిటన్‌లలోనూ పోరాటాలు సాగుతున్నాయి. అక్కడా పాలకవర్గ దుర్నీతి అంతం ఖాయం. భారత మతవాద ప్రభుత్వం మతోన్మాద సంస్థలకు ఊతమిస్తోంది. దేశ విదేశాల్లో 21 సంఘ్ సంస్థలు, ఢిల్లీలోనే 8 సంఘ్ తాత్విక సంస్థలు పనిచేస్తున్నాయి. అనధికారికంగా డజన్ల సంఘ్ తాత్విక సంస్థలు సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. అఘాయిత్యాలు, హింస, హత్యలు సంఘ్ సంస్థల నిత్యకృత్యాలు. ఈ మతోన్మాదాన్ని ఎదిరించటంలో జనం స్తబ్దుగా ఉన్నారు. కాని రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో సాధారణ ఎన్నికల్లో కూడా ఈ విప్లవం పునరావృతమవుతుందని మతోన్మాద నిరంకుశ పాలన అంతమవుతుందని ఆశిద్దాం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News