Wednesday, May 8, 2024

పల్లె ప్రగతితో పురపాలక సంఘాలలో పూర్తిస్థాయి అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

కాగజ్‌నగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పురపాలక సంఘాలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం పట్ట ణ ప్రగతి దినోత్సవాన్ని పురస్కారించుకోని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్, మున్సిపల్ కమీషనర్ అంజయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సద్దాంహుస్సేన్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్‌లు, ప్రజలతో కలిసి డప్పు వాయిద్యాల నడుమ మున్సిపల్ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభించి తెలంగాణ తల్లి విగ్రహం వరకు వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి తిరిగి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోని కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్మన్ జాతీయ జెండాను అవిష్కారించారు.

అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పురపాలక సంఘాలను అభివృద్ధి పాటు పూర్తిస్థాయిలో అధునీకరించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావం అనంతరం గత తొమ్మిది సంవత్సరాలలో కాగజ్‌నగర్ మున్సిపాలిటి అభివృద్ది ఆత్యంత వేగంగా జరిగిందని అన్నారు.

మున్సిపల్ పరిధిలో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి సంరక్షించడం, మిషన్ భగీరథ కార్యక్రమంలో ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ అందించి త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు వార్డులలో ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించాలని, సేకరించిన చెత్తను శుద్ది చేసేందుకు 1 కోటి 34 లక్షల రూపాయలతో శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

పట్టణంలోని రహదారులు, అంతర్గత రహదారులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం జరుగుతుందని, కళ్యాణలక్ష్మి, అసరా పెన్షన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారు ఆర్థికంగా అభివృద్ధ్ది చెందేందుకు మెప్మా ద్వారా రుణాలు అందించడం జరుగుతుందని అన్నారు. పారిశుద్ద కార్మికులు ప్రతిరోజు ఉదయాన్నే లేచి పట్టణాన్ని శుభ్రం చేయడంలో వారి కృషి వెలకట్టలేనిదని అన్నారు.

అనంతరం ఉత్తమ కార్మికులు, ఉద్యోగులు, వార్డు కౌన్సిలర్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సఫాయి కార్మికులను సన్మానించారు. పెద్ద ఎత్తున మహిళలు రంగోలి పోటిలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌లు, కోఅప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News