Thursday, May 16, 2024

ఉపేక్షిస్తే మరింత ముప్పు.. మణిపూర్‌పై ప్రధాని స్పందించాలి

- Advertisement -
- Advertisement -

ఉపేక్షిస్తే మరింత ముప్పు.. మణిపూర్‌పై ప్రధాని స్పందించాలి
ఆర్మీ రిటైర్డ్ చీఫ్ మాలిక్ పిలుపు
మాజీ లెఫ్టినెంట్ జనరల్ ట్వీట్ల ప్రస్తావన
న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఇప్పుడు అత్యంత అసాధారణ పరిస్థితి నెలకొందని, దీనిపై ప్రధాని మోడీ, రక్షణ మంత్రి ఇతరులు వెంటనే స్పందించాల్సి ఉందని భారత సైనిక దళాల మాజీ ప్రధానాధికారి విపి మాలిక్ (రిటైర్డ్) కోరారు. రెండు మూడు నెలలుగా మణిపూర్‌లో ఘర్షణలు సాగుతున్నాయి. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఇళ్లకు కూడా నిప్పుపెడుతున్నారు. కులాల మధ్య ఘర్షణలతో ఎక్కడ ఎప్పుడేమి జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడిందని ఇంఫాల్ నివాసి అయిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎల్ నిశికాంత సింగ్ చేసిన వ్యాఖ్యలను మాలిక్ ఉటంకిస్తూ మాజీ ఆర్మీచీఫ్ ట్వీటు వెలువరించారు. మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లకు ఈ సందేశం వెలువరించారు.

మణిపూర్‌లో అరాచకం నెలకొందని, ఇది ప్రమాదకరం అని నిశికాంత సింగ్ తెలిపిన విషయంతో మాలిక్ ఏకీభవించారు. పదవీబాధ్యతల నుంచి వైదొలిగిన తరువాత ఇప్పుడు మణిపూర్‌లో స్థిరపడ్డ లెఫ్టినెంట్ జనరల్ చేసిన వ్యాఖ్యలు తనను కలవరపర్చినట్లు వేద్‌మాలిక్ తెలిపారు. తాను ఇప్పుడు మణిపూర్‌లో ఇతర పౌరుల మాదిరిగా సాధారణ జీవితం గడుపుతున్నట్లు, ఎవరికి రక్షణ లేకుండా ఉందని, ఇప్పుడు లిబియా, నైజీరియా, లెబనాన్ వంటి కల్లోలిత ప్రాంతాల పరిస్థితి ఏర్పడిందని , చివరికి ఈ మణిపూర్‌ను దాని మానాన దానిని వదిలేసినట్లుగా ఉందని, ఎవరైనా ఈ గోడు వినేవారు ఉన్నారా? అని ప్రశ్నించిన లెఫ్టినెంట్ జనరల్ వ్యాఖ్యలను ఓసారి చూడాలని ఆర్మీమాజీ చీఫ్ కేంద్రంలోని పెద్దలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News