Friday, May 3, 2024

కంప్యూటర్ ఆద్యుడు అర్నాల్డ్ స్పీల్‌బెర్గ్ మృతి

- Advertisement -
- Advertisement -

computer pioneer Arnold Spielberg dies at 103

లాస్ ఎంజిలెస్: కంప్యూటర్ సృష్టిలో ఆద్యుడు, ప్రముఖ ఇంజనీర్ అర్నాల్డ్ స్పీల్‌బెర్గ్ మరణించారు. ఆయన వయస్సు 103 సంవత్సరాలు. ఫ్రఖ్యాత హాలీవుడ్ చిత్రదర్శకుడు, నిర్మాత అయిన స్టీవెన్ స్పీల్‌బెర్గ్ తండ్రి అయిన అర్నాల్డ్ కంప్యూటర్ రంగంలో ఆవిష్కరణలకు ఆద్యులు. ఆయన సృజనాత్మక ప్రతిభతోనే పర్సనల్ కంప్యూటర్ ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ చరిత్ర గతిని మార్చింది. ఎటువంటి అనారోగ్య సమస్య లేకుండా తన కుటుంబ సభ్యుల మధ్య ఉండగానే ఆయన మృతి చెందారు. సీనియర్ స్పీల్‌బెర్గ్, చార్లెస్ ప్రాప్‌స్టెర్‌లో 1950 ప్రాంతంలో జిఇ 225 మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్‌ను రూపొందించారు. దీనిని ప్రాతిపదికగా చేసుకునే ఆ తరువాత కంప్యూటర్ సైంటిస్టులు పిసిలు రూపొందించారు. ప్రోగ్రామింగ్‌లాంగ్వేజ్ బేసిక్‌ను ఆవిష్కరించారు.

ఈ ప్రక్రియతోనే 1970 1980 మధ్యకాలంలో పర్సనల్ కంప్యూటర్ అందరికీ సమగ్రరీతిలో అందుబాటులోకి వచ్చింది. తన తండ్రి జ్ఞాపకాలను పలు ప్రముఖ చిత్రాలను తీసిన స్టీవెన్ స్పీల్‌బెర్గ్ పంచుకున్నారు. అప్పట్లో ఆయన తనకు తాను రూపొందించబోయే కంప్యూటర్ గురించి తరచూ చెపుతూ ఉండేవారని, అయితే ఆ కంప్యూటర్ పరిభాష తనకు అర్థకం కాపొయ్యేదని తెలిపారు. ఉక్రెయిన్ యూధుల వలస కుటుంబానికి చెందిన అర్నాల్డ్ 1917లె సిన్నినాటిలో జన్మించారు.

computer pioneer Arnold Spielberg dies at 103

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News