Tuesday, May 14, 2024

నాథూరాం గాడ్సే పార్టీగా పేరు మార్చుకోండి

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ సారథ్యంలో జరిగిన స్వాతంత్య్రోద్యమాన్ని డ్రామాగా అభివర్ణించిన మాజీ కేంద్ర మంత్రి, కర్నాటకకు చెందిన బిజెపి ఎంపి అనంతకుమార్ హెగ్డేపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బ్రిటిషర్ల చంచాలు, గూఢచారుల నుంచి జాతిపిత మహాత్మా గాంధీకి సర్టిఫికెట్ అవసరం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. బిజెపి పేరును నాథూరాం గాడ్సే పార్టీగా మార్చుకునే సమయం ఆసన్నమైందని బిజెపి అధికార ప్రతినిధి జైవీర్ షేర్‌గిల్ సోమవారం సూచించారు. మరో అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వి ట్రీట్ చేస్తూ బిజెపి సీనియర్ నాయకుడైన హెగ్డే వ్యాఖ్యలపై అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సిద్ధాంతాలపై మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎలా స్పందిస్తారో వేచి చూస్తున్నామని పేర్కొన్నారు.

 

Congress asks BJP to change its name to Godse Party, reacting on Anantkumar Hegdes comments on Mahatma Gandhi it said Gandhi doesnt need certificate from Cadre of Britishers Chamchas
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News