Sunday, April 28, 2024

రెండు రకాల దంతాల ‘ఏనుగు’ కాంగ్రెస్ : నడ్డా ఎద్దేవా

- Advertisement -
- Advertisement -

Congress is like an Elephant with two sets of Teeth: Nadda

 

టింగ్‌ఖాంగ్ (అసోం): రెండు సెట్ల దంతాలున్న ఏనుగు వంటిది కాంగ్రెస్ అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సోమవారం ఎద్దేవా చేశారు. ఏనుగుకు ఒక సెట్ దంతాలు చూపించడానికి, మరో సెట్ దంతాలు నమలడానికి ఉంటాయని, అదే విధంగా కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు, అవకాశ వాదంతో ఉంటుందని విమర్శించారు. దిబ్రుగర్ జిల్లా టింగ్‌ఖాంగ్‌లో ఎన్నికల ర్యాలీలో నడ్డా కాంగ్రెస్ పార్టీ వైఖరిని తూర్పార పట్టారు. విపక్షమైన కాంగ్రెస్‌కు ఓటేస్తే అస్సాం చీకటి లోకి మళ్లుతుందని విమర్శించారు. కేరళలో కాంగ్రెస్ ముస్లిం లీగ్‌తో కలసి సిపిఎంతో పోరాడుతోందని, పశ్చిమబెంగాల్, అస్సోంలో సిపిఎంతో కలసి పోటీ చేస్తోందని ఇది కాంగ్రెస్ అవకాశ రాజకీయవాదంగా ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News