Wednesday, May 8, 2024

కెన్, బెట్వా నదుల అనుసంధానంపై జైరామ్ రమేష్ ఆందోళన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కెన్, బెట్వా నదుల అనుసంధానం వల్ల మధ్యప్రదేశ్‌లోని పన్నా పులుల అభయారణ్యానికి హాని జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య నదుల అనుసంధానంపై సోమవారం ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి అయిన జైరామ్ రమేష్ స్పందిస్తూ పదేళ్ల క్రితమే తాను దీనికి ప్రత్యామ్నాయాలు సూచించానని, కాని వాటిని ఎవరూ పట్టించుకోలేదని ట్వీట్ చేశారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ జల్ శక్తి అభియాన్: వర్షాన్ని ఒడిసిపట్టు పేరిట ఒక ప్రచారాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా యుపి, ఎంపి ముఖ్యమంత్రులు కెన్, బెట్వా నదుల అనుసంధానానికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయనున్నారు.

Jairam Ramesh fears on Interlinking of Ken and Betwa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News