Tuesday, May 7, 2024

ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంపైకాని, ప్రధాని పదవిపై కాని ఆసక్తి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ప్రకటించారు. బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం రెండవ రోజున ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం అధికారాన్ని చేజిక్కించుకోవడం కాదని మనరాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకోవడమేనని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల మధ్య రష్ట్ర స్థాయిలో విభేదాలు ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ అవి సిద్ధాంతపరమైనవి కావని ఆయన చెప్పారు.

ప్రతిపక్షాల సమావేశానికి మొత్తం 26 పార్టీలు హాజరయ్యాయి. గత నెల పాట్నాలో మొదటిసారి సమావేశమైన ప్రతిపక్షాలు మలి సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించుకుంటున్నాయి. సోమవారం రాత్రి విందు సమావేశంతో మొదటి రోజు సమావేశం ముగిసింది. నేటి సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఐక్యంగా బిజెపిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. బెంగళూరు సమావేశాలలో కాంగ్రెస్‌తోపాటు టిఎంసి, డిఎంకె, ఆప్, జెడియు, ఆర్‌జెడి, జెఎంఎం, ఎన్‌సిపి(శరద్ పవార్ గ్రూపు), శివసేన(ఉద్ధవ్ థాక్రే గ్రూపు), సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, అప్నా దళ్, నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్(లిబరేషన్), ఆర్‌ఎస్‌పి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండిఎంకె, విసికె, కెఎండికె, ఎంఎంకె, ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్(ఎం), కేరళ కాంగ్రెస్(జోసెఫ్) పాల్గొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News