Monday, May 13, 2024

2022 నాటికి రామ మందిరం నిర్మాణం

- Advertisement -
- Advertisement -

Ram Mandir

 

లక్నో : రానున్న రెండేళ్లలో అంటే 2022 నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ పేర్కొన్నారు. మందిర నిర్మాణ సన్నాహాలపై చర్చించేందుకు ఆలయ కమిటీ తొలిసారిగా ఈనెల 18న ఢిల్లీలో భేటీ కానుంది. ఈ సమావేశంలో మందిర నిర్మాణాన్ని ఎప్పటినుంచి ప్రారంభించే విషయాన్ని ఖరారు చేయనున్నారు. రామ మందిర నిర్మాణానికి కేటాయించిన 67 ఎకరాల స్థలాన్ని చదునుచేసి ఆపై శంకుస్థ్ధాపన కార్యక్రమం చేపడతామని, మందిర నిర్మాణం పవిత్రమైన రోజున ప్రారంభిస్తామని చౌపాల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ మందిర శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కాగా మందిర నిర్మాణానికి 67 ఎకరాల భూమి సరిపోదని, మరింత భూమి అవసరమని అన్నారు.

Construction of Ram Mandir by 2022
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News