Monday, April 29, 2024

ఉస్మానియాలో రెండేళ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స

- Advertisement -
- Advertisement -

Rare Surgery

 

హైదరాబాద్ : రెండు వైపులా దవడ ఎముకలు విరిగిపోయిన రెండేళ్ల చిన్నారికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల బృందం క్లిషమైన పరి స్థితుల్లోనూ అత్యాధునిక పద్దతుల్లో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి చిన్నారికి ప్రాణదానం చేశారు. ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ చిన్నారి శస్త్రచికిత్సకు సంబంధిత వివరాలను వెల్లడించారు. నాంపల్లి రాందాస్ తండా ప్రాంతానికి చెందిన రెండేళ్ల ఇందుమతి జనవరి 29న ప్రమాదవశాత్తు గాయాలకు గురైం ది. దీంతో చిన్నారి రెండు వైపులా దవడ భాగం విరిగిపోయింది. కుటుంబ సభ్యులు చికిత్సల నిమిత్తం ఇందుమతిని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించగా, అవసరమైన చికిత్స అందించి, ఉస్మానియా ఆసుపత్రికి రిఫ ర్ చేశారు. జనవరి 30న చిన్నారి ఇందుమతిని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు చూపించగా, ఇందుమతిని పరీక్షించిన ఆ సుపత్రి వైద్యులు న్యూరో సర్జరీ విభాగంలో చేర్చుకుని, చికిత్సలు నిర్వహించిన అనంతరం ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి రిఫర్ చేశారు.

ఇందుమతికి గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో పాటు రెండు వైపులా దవడలు పూర్తిగా విరిగిపోయి, నోరుతెరుచుకోక పోవడంతో అనస్థిషియా విభాగాధిపతి డాక్టర్ పాండునాయక్, ఫ్రొఫెసర్ డాక్టర్ పావని, అసోసియేట్ ఫ్రొఫెసర్ జ్యోతిల నేతృత్వంలో వైద్యబృందం తొలిసారిగా అత్య ంత క్లిష్టమైన (ఫైబర్ ఆఫ్టక్ ఇంట్యూబేషన్ బ్రాంకో స్కోపి గైడెడ్ ) విధానంతో ముక్కు ద్వారా శస్త్రచికిత్సను విజయ వంతంగా నిర్వహించారు. తొలిసారిగా ఎంతో క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన అనస్థిషియా విభాగాధిపతి డాక్టర్ పాండునాయక్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్‌లతో పాటు శస్త్రచికిత్సలలో పాల్గొన్న వైద్యులు, సిబ్బందిని ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ అభినందించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నికడగా ఉందని, భవిష్యత్‌లోనూ ఇలాంటి అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సలను చేస్తామని డాక్టర్ బి.నాగేందర్ తెలిపారు.

Rare Surgery for two year old Child in Osmania
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News