Sunday, May 5, 2024

కేజ్రీవాల్ గెలిస్తే అభివృద్ధి ఎజెండాదే గెలుపు

- Advertisement -
- Advertisement -

Adir Ranjan

 

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆయన స్పందిస్తూ ఢిల్లీ ఎన్నికలపై తాము మొదటి నుంచి భారీ అంచనాలు పెట్టుకోలేదని, తమ బలాన్నంతా కూడదీసుకుని ఎన్నికల బరిలో పోరాడామని, ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో బిజెపి మతతత్వ అజెండాతో ముందుకువస్తే కేజ్రీవాల్ అభివృద్ధి అజెండాతోముందుకొచ్చారని అన్నారు. కేజ్రీవాల్ గెలిస్తే అభివృద్ధి అజెండా గెలుపుగా భావించాలని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఇన్‌ఛార్జ్ పీసీ చాకో ఆశాభావం వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత ఆప్‌తో పొత్తుపై నిర్ణయం ఉంటుందని అన్నారు.

Adir Ranjan praised Kejriwal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News