Tuesday, May 14, 2024

తాగునీటి నల్లాలో కలుషిత జలాలు

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : ప్రభుత్వ మల్లేపల్లి ఐటీఐ పక్కనే మసీద్ వద్ద ఏబ్యాట్రీలైన్‌లో కొన్ని రోజులుగా స్థానికుల ఇళ్ల నల్లాల్లో కలుషిత జలాలు వస్తున్నాయి. తాగునీటిలో డ్రైనేజీ దుర్వాసనతో నల్లాలో సరఫర అవుతోంది. నల్లాలో మురికినీరు రావడం జలమండలి వర్గాల నిర్లక్షానికి పరాకాష్ఠ అంటూ బస్తీవాసులు మండిపడుతున్నారు. కొందరు తెలియక నీటిని తాగడం వల్ల పలు వ్యాధులబారిన పడుతున్నారు. పలువురు ఇదే నీటితో ఉదయాన్నే స్నానాలు చేయడం వల్ల శరీరంలో ఒకటే గోకుడు, దురద వంటి సమస్యలు నెలకొన్నాయని వారు చెబుతున్నారు. నీటిని పట్టుకోలేక బస్తీవాసులు రోజూవారీగా స్నానాలు చేయలేకపోతున్నారు. కొందరైతే మార్కేట్‌లో మినరల్ వాటర్ బాటిళ్లను కొని తాగుతున్నారు. మంచి నీటిలో కలుషీత నీరు రావడాన్ని పలువురు బాటిళ్లలో ఆ మురికినీరు నింపి అధికారులకు స్వయంగా చూపుతున్నారు.

కానీ నేటికి చక్కదిద్దే చర్యలు లేవు. పరిస్థితి ఇలానే ఉంటే బస్తీవాసుల ప్రాణాలను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ స్థానికుల్లో నెలకొన్న తీవ్ర ఆందోళనలు… పరిస్థితిని వెంటనే గుర్తించి చక్కదిద్దే చర్యలకు జలమండలి వర్గాల దిగకపోవడం స్థానికుల్లో ఆసహానం వ్యక్తమవుతోంది. మురికినీరు తాగాలా.. వీటినే వాడాలా అంటూ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఇటీవలే మసీద్ ఎదురుగా రిపేర్ల కోసం గుంతలు తవ్వకాలు చేశారు. ఈ తవ్వకాల ధాటికి భూగర్భంలో తాగునీటి లైన్, డ్రైనేజీ పైపులు పక్కపక్కనే ఉన్నాయి. డ్రీల్లింగ్ ధాటికి పైపులు పగిలి డ్రైనేజీ నీరు తాగునీటి పైపులోకి వెళుతున్నాయి.

ఈ కారణంగా ఇళ్లలో నల్లాలో వాసనతో కూడిన మురికినీరు రావడాన్ని పలువురు తొలుత ఆశ్చర్యపోయారు. కొన్ని రోజులుగా కలుషీత నీరు రావడం స్థానికులకు పెద్ద సమస్యగా మారింది. ఈ విషయాన్ని స్థానిక బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నరేందర్ కుమార్‌పటేల్ జలమండలి వర్గాల దృష్ఠికి తీసుకొచ్చారు. కానీ ఈ దిశగా వారు చర్యలకు ఉపక్రమించకపోవడం గమనార్హం.. మురికినీరు తాగి బస్తీవాసులకు ఎమైన జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నించారు. ప్రజారోగ్య దృష్ఠా ఈ సమస్యను అధికారులు సీరియస్‌గా పరిగణించి యుద్దప్రాతిపదికన నల్లాల్లో కలుషీత జలాల సరఫరా జరగకుండా వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News