Monday, April 29, 2024

ఉచిత వైద్య శిబిరాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

వనస్థలిపురం : కార్పొరేటర్ హస్పిటల్ వారు స్వచ్చందం గా కాలనీలలో నిర్వహింస్తున్నటువంటి ఉచిత వైధ్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని బిఎన్‌రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి వెల్లడించారు. బిఎన్‌రెడ్డి నగర్ డివిజన్ లోని వైదేహినగర్ కాలనీ ఆరతి గంథ్రాలయంలో అపోలో హాస్పిటల్స్, స్మార్ట్ విజన్ ఫ్రంట్ డెం టల్ వారి సౌజన్యంతో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య పరిక్ష శిబిరంలో కార్పొరేటర్ లచ్చి రెడ్డి ప్రాల్గొన్నారు.

అనంతరం కార్పొరేటర్ లచ్చిరెడ్డి మా ట్లాడుతూ కాలనీలలోని సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకోని వారికి ఉచితంగా సేవలు చేయడానికి ముందుకు వచ్చిన వైద్య సిబ్బందిని కార్పొరేటర్ అభినందించారు. ఈ వైద్య శిబిరం ద్వారా ప్రజలు తమ ఆరోగ్య సమస్యలు డాక్టర్ల దృష్టికి తీసుక వచ్చి పరిష్కరించుకోవాలని కాలనీ వాసులను కార్పొరేటర్ లచ్చిరెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు దామోదర్ రె డ్డి, ఉపాద్యక్షులు కిషన్ రావు, కార్యదర్శి జంగారెడ్డి, కొశాదికారి ప్రసాద, కా ర్యవర్గ సభ్యులు చౌదరి, బుచ్చయ్య, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News