Wednesday, May 15, 2024

ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ వందస్థానాల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుంది

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సారధ్యంలో బీఆర్‌ఎస్ పార్టీకి వంద స్థానాలు గెలిచి తీరుతుందని నాంపల్లి నియోజకవర్గం ఆపార్టీ ఇన్‌ఛార్జీ సీహెచ్ ఆనందకుమార్ గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. 14లో తెలంగాణ సెంటిమెంట్‌తో తమ పార్టీ గెలిచి అధికార పగ్గాలు చేపట్టగా.. తర్వాత 18లో కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ది, సమర్ధ పాలనను చూసి ప్రజలు పట్టం కట్టారని, త్వరలో జరిగే ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్ వంద సీట్లు సాధించి విజయఢంకా మోగిస్తుందని వివరించారు. ఈమేరకు శనివారం నాంపల్లిలో పార్టీ కార్యాలయంలో శంకర్‌నగర్, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వివిధ పార్టీకు చెందిన అనేకమంది నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సాధరంగా ఆహ్వానించి పార్టీ కండువలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

ఈ సందర్బంగా ఆనందకుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా బీఆర్‌ఎస్ మూడుసార్లు విజయంతో హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు. కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ది జరిగిందని, మౌలిక వసతులు మెరుగుపడ్డాయని, అన్ని వర్గాల సమగ్రాభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్‌లో జరగనున్నాయని, అందుకు పార్టీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డి సన్నధ్దులు కావాలని ఆయన పిలుపినిచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ది, స్వదేశీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగిందని, అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ది సాధించిందన్నారు. తొమ్మిదేళ్లకు ముందు, ప్రస్తుతం తెలంగాణలో అనూహ్యంగా మార్పు కనిపిస్తోందని, ఎక్కడ చూసిన అభివృద్దే కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నరేందర్ కుమార్‌పటేల్, నారాయణ, మురళీధర్, రమేశ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News