Friday, May 3, 2024

రాష్ట్రంలో అందరికీ ఉచితంగా కరోనా టీకా : కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Corona vaccine free for everyone in Telangana

హైదరాబాద్: కరోనా టీకా విషయంలో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ  ఉచితంగా కరోనా టీకా వేయనున్నట్టు సిఎం కెసిఆర్ తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం దాదాపు రూ.2500 కోట్లు ఖర్చు అవుతుందని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదన్నారు. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించామని సిఎం ప్రకటించారు. వ్యాక్సినేషన్ ను స్వయంగా పర్యవేక్షిస్తాని ఆయన పేర్కొన్నారు. 2,3 రోజుల్లో వైద్య పరీక్షల తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని సిఎం చెప్పారు. ఆక్సిజన్, రెమెడిసివిర్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని సిఎం కెసిఆర్ తెలిపారు.

కరోనా బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని, ఆసుపత్రుల్లో పడకల కొరత, మందుల కొరత రానివ్వమని ఆయన తేల్చిచెప్పారు. కరోనా సోకిందని అధైర్యపడవద్దని, ధైర్యంతో ముందుకు సాగి చికిత్స చేయించుకోవాలని ఆయన రాష్ట్ర ప్రజలకు సూచించారు. కరోనా బారినపడకుండా ప్రజలు స్వీయనియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని, బయటకు వచ్చినప్పుడు విధిగా సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు దరించాలని కెసిఆర్ ప్రజలను కోరారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

 

Corona vaccine free for everyone in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News