Friday, April 26, 2024

రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న సాయిపల్లవి పాట..

- Advertisement -
- Advertisement -

'Saranga Dariya' lyrical song crosses 150 million mark

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరి’. క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాలోని ‘సారంగ దరియా’ లిరికల్ సాంగ్‌ మాత్రం యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుంది. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ రచించిన ఈ పాటను మంగ్లీ ఆలపించింది. దీనికి తోడు ఈ మాస్ సాంగ్ లో సాయి ప‌ల్ల‌వి వేసిన అదిరిపోయే స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ పాట‌ యూట్యూబ్ లో అత్యంత వేగంగా దూసుకుపోతోంది. తాజాగా ఈ పాట టాలీవుడ్ లోనే అత్యంత వేగంగా 150 మిలియన్ల మైలురాయిని అందుకుని వావ్ అనిపిస్తుంది. కాగా, ఏప్రిల్ 16న థియేట‌ర్‌లో విడుద‌ల కావాల్సిన ఈ సినిమాను కరోనా కారణంగా చిత్రయూనిట్ మరోసారి ఈ సినిమా విడుదలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

‘Saranga Dariya’ lyrical song crosses 150 million mark

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News