Tuesday, May 14, 2024

దేశంలో నేటి నుంచి రెండో వ్యాక్సిన్ డ్రైరన్

- Advertisement -
- Advertisement -

Corona Vaccine is successful by Harsh Vardhan

న్యూఢిల్లీ :దేశంలో కొవిడ్ 19 వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో ఈనెల 8 శుక్రవారం నుంచి రెండో విడత డ్రైరన్‌ను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా దాదాపు 700 జిల్లాల్లో ఈ డ్రైరన్ నిర్వహిస్తారు. దేశంలో తొలివిడతలో 30 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ సరఫరాకు సంసిద్ధతను పరీక్షించడానికి జనవరి 2న మొదటి విడత డ్రైరన్ నిర్వహించారు. ఇప్పుడు మరోసారి డ్రైరన్ నిర్వహించడం ద్వారా వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన కోవిన్ అప్లికేషన్ క్షేత్రస్థాయి పనితీరును పరీక్షించనున్నట్టు తెలుస్తోంది. తొలి విడతలో ప్రాధాన్యత వర్గాల వారీగా వ్యాక్సినేషన్ నిర్వహించడానికి దేశం సిద్ధంగా ఉంది. మొదటి విడత వ్యాక్సిన్ సరఫరాను అందుకోడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది.

ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్,ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్,మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో గుర్తించిన సరఫరా కేంద్రాలకు వ్యాక్సిన్ పంపడమౌతుందని వెల్లడించింది. మిగతా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్, నికోబార్, అరుణాచల్‌ప్రదేశ్, ఛండీగఢ్, డామన్, నగర్‌హవేళీ, డామన్, డయ్యు, గోవా, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్, లక్షద్వీప్, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌ల్లో ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపోలకు వ్యాక్సిన్ పంపనున్నట్టు వివరించింది. ఈమేరకు ముందుగా అన్ని ఏర్పాట్లు చేయాలని, వ్యాక్సిన్ తీసుకోడానికి సిద్ధంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వశాఖలోని రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్(ఆర్‌సిహెచ్) అడ్వైజర్ డాక్టర్ ప్రదీప్ హాల్డర్ ఒక లేఖ ద్వారా తెలియజేశారు. నమోదైన లబ్ధిదారుల జాబితా ప్రకారం జిల్లాలకు వ్యాక్సిన్ సరఫరా అవుతుందని తెలియచేశారు. ఈమేరకు ప్రత్యేక సమాచారం పంపడమౌతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News