Wednesday, May 8, 2024

టీకాకు మరో రెండేళ్లు

- Advertisement -
- Advertisement -

వ్యాక్సిన్ల పనితీరుపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది, దానికోసమే మరో ఏడాది సమయం పడుతుంది
రోగుల సంఖ్యను బట్టి వైరస్ వ్యాప్తిని అంచనా వేయలేం
అవగాహనలేమితో కరోనాను తక్కువ అంచనా వేస్తున్నారు
తెలంగాణలో రోగుల సంఖ్య తగ్గడం సంతోషకరం
మాస్క్, భౌతికదూరం పాటించడమే శ్రేయస్కరం
మీడియాతో సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్‌కు రెండేళ్ల వరకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని సిసిఎంబి(సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజి) డైరెక్టర్ రాకేష్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అనేక కంపెనీలు వ్యాక్సిన్ తయారీకి శ్రమిస్తుండగా, వాటి పనితీరుపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. దీనికి మరో ఏడాది వరకు సమయం పడుతోందని ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్దిపై ఆయన సిసిఎంబి సెమినార్ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా డైరెక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ…భారతదేశంలో కరోనా వైరస్ తగ్గిపోయిందను కుంటే పొరపాటేనని చెప్పారు. చాలా మంది వైరస్‌ను అపోహలతో, అవగాహన లేమి తనంతో తక్కువ అంచనా వేస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమన్నారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు మాస్కు, భౌతిక దూరం, వ్యక్తిగత,పరిసరాల పరిశుభ్రతలే వైరస్ బారిన పడకుండా కాపాడతాయని ఆయన వ్యాఖ్యానించారు. వైరస్‌ను నియంత్రించేందుకు స్పష్టమైన వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని సూచించారు. ఇప్పటికే ఇతర దేశాలతో పాటు భారత్ కూడా వ్యాక్సిన్ తయారీలో ముందడుగులో ఉందని ఆయన గుర్తుచేశారు.

బయోటెక్, అరబిందో ఫార్మసీ సహా వివిధ కంపెనీలతో కలసి వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నామన్నారు. ఇండియా వ్యాక్సిన్ల పనితీరుపై కూడా వచ్చే ఏడాది నాటికి సమగ్రమైన స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. అయి తే కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకురావడమనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టతరమైన వ్యవహారమని తెలిపారు. దీనికి ఎంతో శ్రమతో పాటు ఆర్థికంగా కూడా భారీగా వెచ్చించాల్సి ఉంటుందన్నారు. అంతేగాక వ్యాక్సిన్ తయారు చేస్తున్న సైంటిస్టులకు తోడు అదృష్టం కూడా కలసిరావాలని ఆయన చెప్పా రు. ఇతర దేశాలలో పోల్చితే భారత్‌లో వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉందన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లోనూ రోగులు తగ్గడం సంతోషకరమన్నారు. అయితే ఆసుపత్రుల్లో రోగుల సంఖ్యను బట్టి వైరస్ తీవ్రతను అంచనా వేయలేమని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత దేశంలో దాదాపు 70 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ, వీరితో వ్యాప్తి అయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే వైరస్ గాలి, నీళ్లు, ఖాళీ ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తిని అంచనా వేసేందుకు రీసెర్చ్‌లు చేస్తున్నామని తెలిపారు. రాబోయే మరో మూడు నెలల్లో వ్యాక్సిన్ల తయారీ ఒక కొలిక్కే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అవసరమైన అపోహాలతో వైరస్‌ను నిర్ల క్షం చేయొద్దని ఆయన సూచించారు.
మరోసారి లాక్‌డౌన్ ప్రమాదం : సిఇఓ మధుసూదన్‌రావు
కరోనా వైరస్ విజృంభణ ఇదే విధంగా కొనసాగితే మరో సారి లాక్‌డౌన్ విధించే పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉందని సిసిఎంబి సిఇఓ మధుసూధన్‌రావులు వెల్లడించారు. దేశంలో కేసుల తగ్గినప్పటికీ, వైరస్ తీవ్రత తగ్గలేదన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. ప్రస్తుతం తయారు చేస్తున్న వ్యాక్సిన్లలో ఏది సక్రమంగా పనిచేస్తుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈక్రమంలో సామాన్యుడికి అనుకున్నంత సులువుగా వ్యాక్సిన్ లభించే అవకాశం చాలా తక్కువని తెలిపారు.

Corona Vaccine will not come this year: CCMB CEO

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News