Thursday, April 18, 2024

కరోనా వ్యాక్సిన్లతో వంధ్యత్వం రాదు

- Advertisement -
- Advertisement -

పురుషుల సంతానోత్పత్తి సామర్ధంపై కరోనా వ్యాక్సిన్లు ఎలాంటి దుష్ప్రభావం చూపించవని అమెరికా లోని మియామీ యూనివర్శిటీ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. టీకాలు వేసుకోక ముందు, వేసుకొన్న తరువాత ఈ రెండు సందర్భాల్లోనూ వీర్యం నాణ్యత, శుక్ల కణాల సంఖ్యలో చెప్పుకోదగ్గ మార్పులు ఏవీ కనిపించలేదని , శుక్ల కణాలు తగ్గలేదని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

ఈ పరిశోధనలో భాగంగా 45 మందికి మొదట పరీక్షలు నిర్వహించారు. వారిలో 21 మంది ఫైజర్, 24 మందికి మోడెర్నా టీకాలు వేశారు. ఫైజర్ వేసుకున్న వారిలో టీకా వేసుకోక ముందువారిలో సగటున మిల్లీ లీటర్ వీర్యంలో 2.6 కోట్ల శుక్ల కణాలు ఉండగా, టీకా వేసుకున్న తరువాత అవి 3 కోట్లకు పెరిగాయి. మోడెర్నా వేసుకున్న వారిలో 3.6 కోట్ల నుంచి 4.4 కోట్లకు పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News