Sunday, April 28, 2024

జిల్లాల్లో జీరో

- Advertisement -
- Advertisement -

Corona victims

 

ఆదివారం నాడు కొత్తగా జిహెచ్‌ఎంసి పరిధిలోనే 11 కేసులు, 10 జిల్లాలు కరోనా ఫ్రీ
1001కి చేరిన బాధితుల సంఖ్య
కోలుకుంటున్న 660 మంది
కొవిడ్‌ను జయించిన 75 ఏళ్ల వృద్ధుడు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య వెయ్యి దాటింది. ఆదివారం కొత్తగా 11 కేసులు నమోదుకా గా, ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కావడమే గమనార్షం. మిగతా అన్ని జిల్లాలోనూ జిరో కేసులు నమోదు కావడం గమనార్హం. నోటిఫైడ్ ఆసుపత్రుల నుంచి 9 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. కొత్తగా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1001కి చేరుకోగా, వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకోని 316 మంది డిశ్చార్జ్ అయ్యారు. 660 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు 25 మంది చనిపోయినట్లు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి ఓ తాత ముందు తలొగ్గింది. బి.పి షుగర్ వ్యాధులు ఉన్నప్పటికీ సదరు వృద్ధుడు కరోనాపై విజయం సాధించాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లోచ్చిన వ్యక్తి నుంచి ఇతనికి వైరస్ సోకింది. దీంతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించి వైద్యాధికారులు మెరుగైన వైద్యం అందించారు. రిస్క్ ఉన్నప్పటికీ, క్రమక్రమంగా కరోనాని కంట్రోల్ చేస్తూ అధికారులు అతనికి ఆరోగ్యవంతంగా ఇంటికి పంపించారు.

కరోనా ఫ్రీగా 10 జిల్లాలు
10 జిల్లాలు కరోనా ఫ్రీ అయ్యాయి. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, ములుగు, సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల్, నారాయణ్‌పేట, యదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి జిల్లాలు ఉన్నాయి. ఇందులో నాలుగు జిల్లాల్లో ఒక్క కేసు కూడా ఇంతవరకు నమోదు కాలేదు. మిగతా జిల్లాల్లో కేసులు నమోదైనప్పటికీ కొవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ కావడంతో కరోనా ఫ్రీ అయ్యాయి. సిద్ధిపేటలో కరోనా అనుమానిత కేసులన్నీ నెగిటివ్ అని తేలడంతో మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.

64 శాతం 40 ఏళ్ల లోపే
రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఒక నివేదిను రూపొందించింది. దీని ప్రకారం మొత్తం పాజిటివ్ కేసుల్లో 45 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ళ మధ్య వయస్కులు ఉన్నారు. వీరిలో టీనేజర్స్ సుమారు 10 శాతం ఉన్నట్లు తేలింది. ఇక 41 నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్సు వారు 15 శాతం మంది, 51 నుంచి 60 ఏళ్ళ మధ్య వారు 13 శాతం చొప్పున ఉన్నారు. ఐదేళ్ళలోపు చిన్నారులకు కూడా వైరస్ సోకడంతో మొత్తం కేసుల్లో వారు సుమారు 5 శాతం ఉన్నారు. మొత్తం పాజిటివ్ పేషెంట్లలో సుమారు 64 శాతం మంది నలభై ఏళ్ళ వయసులోపు వారేనని స్పష్టమవుతోంది.

వైద్య సిబ్బందిని అభినందించిన నగర మేయర్
కరోనా కట్టడికి శ్రమిస్తున్న వైద్యులు, సిబ్బందిని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అభినందించారు. ఆయన ఆదివారం అమీర్‌పేటలోని ప్రకృతి వైద్యశాలలోని క్వారంటైన్ వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ అందుతున్న వైద్య సేవలు, టెస్టింగ్ సదుపాయాలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందిని అభినందించారు. వైద్యశాల ఆవరణలో రసాయన ద్రావణాల పిచికారీని పరిశీలించారు.

జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కేసులు
ఇప్పటి వరకు జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. జిహెచ్‌ఎంసి పరిధిలో 540, సూర్యాపేట 83, నిజామాబాద్ 61, వికారాబాద్ 37, గద్వాల్ 45, రంగారెడ్డి 33, వరంగల్ అర్బన్ 27, నిర్మల్ 20, కరీంనగర్ 19, ఆదిలాబాద్ 21, మేడ్చల్ 22, నల్లగొండ , 17, కామారెడ్డి 12, మహబూబ్‌నగర్ 11, ఖమ్మం 8, సంగారెడ్డి 7, మెదక్ 5, ఆసిఫాబాద్ 7, భద్రాద్రి కొత్తగూడెం 4, భూపాలపల్లి, జనగాం, జగిత్యాల, సిరిసిల్లలో మూడు చొప్పున, నాగర్‌కర్నూల్, ములుగు, పెద్దపల్లి రెండు చొప్పున సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట జిల్లాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

Corona victims has exceeded one thousand
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News