Tuesday, May 7, 2024

కట్టడి చేయకపోతే కష్టమే

- Advertisement -
- Advertisement -

hyderabad-traffic

 నగరంలో పెరుగుతోన్న కేసులతో బెంబేలు
వారంరోజుల నుంచి గ్రేటర్‌లోనే పాజిటివ్ కేసులు నమోదు
మద్యం, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూసివేయాలి
రోడ్లపై వాహనాలు తిరగకుండా కట్టడి చేయాలని స్థానికుల విన్నపం

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయకపోతే మరింత విజృంభించి ప్రజల ప్రాణాలను పొట్టలో పెట్టుకుందని నగరవాసులు హడలిపోతున్నారు. ప్రభుత్వం 40 రోజులపాటు లాక్‌డౌన్ పకడ్బందీ అమలు చేయడంతో తక్కువగా సంఖ్య కేసులు నమోదుగా, గత వారం రోజుల నుంచి మద్యం దుకాణాలతో పాటు రిజిస్ట్రేషను కార్యాలయాలు, రవాణ శాఖ సేవలు ప్రారంభం కావడంతో వాహానాలు పెద్ద ఎత్తున రోడ్లపై తిరగడంతో కరోనా వైరస్ రెక్కలు కట్టుకుని ప్రజలపై విరుచుకపడుతుంది.

వివిధ పనులపై వెళ్లే వారంతా మాస్కులు ధరించకుండా, శానిటైజన్ వినియోగించకుండా అడ్డగోలుగా తిరుగుతుండటంతో కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా నాలుగు రోజుల నుంచి కేసులు పరిశీలిస్తే గ్రేటర్ నగరంలో మంగళవారం నాటికి 826కు చేరగా శనివారం 30, ఆదివారం 26, సోమవారం 79, మంగళవారం 51 కేసులు నమోదయ్యాయి.

రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరగడంతో ఉన్నతాధికారులు నిర్లక్షం వహిస్తే ప్రజలు నగరంలో జీవించడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడుత, రెండ విడత లాక్‌డౌన్‌లో పాటించిన విధంగా లాక్‌డౌన్ అమలు చేసి మద్యం, ప్రభుత్వం కార్యాలయాలు మూసివేస్తే పరిస్థితి అదుపులోకి రావొచ్చని వైద్యశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఒక పక్క కరోనా కేసులు తగ్గుతుండగా, కొత్త ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తికి ముక్కుతాడు వేయడం సాధ్యం కాదని పేర్కొంటున్నారు. దీనికి తోడు ముంబాయి, గుజరాత్ నుంచి వలస కార్మికులు రావడంతో వారి నుంచి మరికొంతమంది సోకిన పాజిటివ్ కేసులు అధికంగా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. జియాగూడ, చత్రినాక, గౌలిగూడ, దిల్‌షుక్‌నగర్, వనస్థ్దలిపురం, అల్వాల్, మలక్‌పేట ప్రాంతాల్లో వైరస్ వేగం విస్తరిస్తుంది. వైద్యశాఖ, జీహెచ్‌ంఎసీ అధికారులు బస్తీల్లో ఇంటింటికి తిరిగి అవగాహన చేపడుతున్న ఫలితం శూన్యంగా మారిందని ఆందోళన చెందుతున్నారు.

ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలు పాటించి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా సొంతంగా క్వారంటైన్ చేసుకుంటే కరోనాను కంట్రోల్ అదుపులో పెట్టవచ్చంటున్నారు. ఇప్పటికైన ప్రభుత్వ ఉన్నతాధికారులు గ్రేటర్ నగరంలో రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు చేపట్టి, మద్య దుకాణాల మూసివేసి, రోడ్లపైకి వచ్చే వాహానాలకు సీజ్ చేస్తే కరోనా వ్యాప్తి తగ్గుతుందని వివరిస్తున్నారు. ఆర్దిక కార్యకలపాల పేరుతో దుకాణాలు తెరిచి, ప్రజలు అవసరాల కోసం వెళ్లడంతో వైరస్‌కు ఎదురులేకుండా పోయిందని, వెంటనే ప్రభుత్వం లాక్‌డౌన్ విషయంలో మరోసారి ఆలోచించాలని స్దానికులు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News