Friday, April 26, 2024

14 షాపులు సీజ్

- Advertisement -
- Advertisement -
Covid-19-Rules
కోవిడ్ నిబంధలను పట్టించుకోని షాపుల నిర్వాహకులు

హైదరాబాద్: కోవిడ్ 19న నిబంధనలకు విరుద్ధంగా షాపులను తెరిచిన వారిపై జిహెచ్‌ఎసి అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడవ దశ లాక్‌డౌన్ అనంతరం నిర్మాణ రంగానికి సంబంధించిన ఐరన్, స్టీల్ షాపులకు అదే విధంగా వ్యయసాయ రంగానికి సంబంధించిన పంపుసెట్లు, ఇతర వ్యసాయ సంబంధిత షాపులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే ఇదే అదునుగా అనుమతి లేకున్నా కొంత మంది షాపుల నిర్వాహకులు వారి ఆ షాపులను ఓపెన్ చేసి వ్యాపారాలను చేస్తూ నిబంధనలు అతిక్రమిస్తున్నారు.

ఈ అంశంపై దృష్టి సారించిన జిహెచ్‌ఎంసికి చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్, అండ్ విజిలెన్స్ అధికారులు సంబంధిత శాఖ డైరక్టర్ విశ్వజిత్ కంపాటి ఆధ్వర్యంలో సికింద్రాబాద్, అల్కాపురి, స్నేహపురి కాలనీ, దిల్‌షుక్‌నగర్, సైదాబాద్, అమీర్‌పేట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి జిహెచ్‌ఎంసి యాక్ట్ 1955 ఆఫ్ 2 ఎపిడమిక్ యాక్ట్ 1897 కింద మొత్తం 14 షాపులను సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రిమించిన వారు ఎంతటి వారినైనా వదిలి పెట్టేదిలేదని అధికారులు హెచ్చరించారు.

14 Shops Sealed For violating Covid 19 Rules

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News