Thursday, May 2, 2024

తోడేళ్లదే రాజ్యం

- Advertisement -
- Advertisement -

మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో…. తోడేళ్లదే రాజ్యం

అవినీతికి కేరాఫ్‌గా మారిన వైనం
పేద రైతుల భూముల్లో వివాదాలు
వరుసగా ఎసిబికి పట్టుబడుతున్న రెవెన్యూ అధికారులు
పేద రైతు బుచ్చన్న భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్
ఈ కార్యాలయంలో తలారీ చెప్పిందే వేదం
ఎప్పటి నుంచో ఎసిబి నజర్ ?

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో:  నారాయణపేట జిల్లా మరికల్ తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రెవెన్యూలో జరుగుతున్న అవినీతి ని అంతమొందించేందుకు ప్రక్షాళన చేస్తున్నప్పటికీ ఇంకా రెవెన్యూ శాఖలో మార్పులు జరగడం లేదు. అవినీతికి చెక్ పడడం లేదు. మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో తొడేళ్లదే రాజ్యంగా మారింది. పై సలు లేనిదే పని కావడం లేదన్న ఆరోపణలు తీవ్ర ంగా ఉన్నాయి. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి అమ్యమ్యాలకు పాల్పడుతున్నారు. ఏ పని కావాలన్నా చేయి తడపాల్సిన పిరిస్ధితి నెలకొంది. కింది స్దాయి నుంచి పై స్థాయి వరకు ఎవరికి తోచిన విధ ంగా వారు దోచుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అమాయక రైతులను నమ్మించి వారి భూములకు కూడా ఎసరు పెట్టే మోసగాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక రైతుకు చెందిన భూమిని పిఎం కిషాన్ పేరు చెప్పి రైతు వేలి ముద్రలు వేయించుకొని మూడు ఎకరాలకు పైగా అక్రమ రిజిష్టర్ చేసుకున్నారు. ఈ తతంగాన్ని అంతా నడిపించింది ఈ కార్యాలయంలోని ఒక విఆర్‌ఎనే కావడం గమనార్హం. ప్రస్తుతం ఆ విఆర్‌ఎపై స్ధానిక పోలీస్ స్టేషన్‌లో కేసు కూడానమోదు అయింది. ఐపిసి 420,341,343 చీటింగ్, అక్రమ నిర్భంధం తదితర కేసులు నమోదు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూదా అనేకం ఈ కార్యాలయంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భూములకు డిమాండ్ పెరగడంతో అక్రమార్కులు పేద రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ధరణిలో అక్రమంగా రిజిష్ర్టేషన్లు చేసుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. కొంత మంది రైతుల భూములను ధరణిలో నమోదు కాకుండా సమస్యలు సృష్టించి నిలిపివేసి నానారకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.భూములు ఆన్‌లైన్‌లోనూ, ధరణిలోనూ నమోదు కావాలంటే చేతులు తడపాల్సిన పరిస్ధితులు ఏర్పడినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

ఎకరంకు ఇంత చొప్పున చేతులు తడిపిన తర్వాతనే ధరణిలో నమోదు చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూలో రైతులకు జరుగుతున్న అవినీతిని చెక్ పెట్టి రైతుల భూములకు రక్షణ ఉండేలా పారదర్శంగా ఉండాలనే లక్షంతో ధరణిని తీసుకొచ్చింది. అయి తే అక్రమార్కులు ధరణిని కూడా తమకు అనుకూలంగా మార్చుకొని రైతుల భూములపై వివాదాలు సృష్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ కార్యాలయంలో ఉన్న ఒక తలారి ఏకంగా అంతా తానై నడిపిస్తున్నాడని చెబుతున్నారు. మామూళ్లు మాట్లాడుకొన్న తర్వాతనే పనులు చేపిస్తూ దళారి అవతారం ఎత్తినట్లు సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో ఎసిబికి పట్టుబడ్డ ఇద్దరు తహసీల్దార్లు

గతంలో భూమికి సంబంధించిన విషయాలలోనే ఈ తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్ద రు తహసీల్దార్లు ఎసిబికి చిక్కి జైలు ఊచలు లెక్కబెట్టారు. అయినప్పటికీ ఈ కార్యాలయంలో మార్పు లు రాలేదు. 2021,2002 లో సైతం ఇద్దరు అధికార్లు ఎసిబికి చిక్కారు. రైతు భూమిని విరాసత్ చేయడానికి లంచం తీసుకుంటుండగా ఒకరు పట్టుబడగా, మరొకరు మ్యూటేషన్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేసి దొరికి పోయారు. మరి కొందరు మరో కేసులో చాకచక్యంగా తప్పించుకోగల్గారు. ఇద్దరు అధికారులు ఎసిబికి చిక్కిన చరిత్ర ఉన్న ఈ కార్యాలయంను పై అదికారులు ప్రక్షాళన చేయడం లేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఈ కార్యాలయంలో దళారులకు,పైరవీకారులకు మాత్రమే పనులు జరుగుతున్నాయని నిజమైన వారికి పనులు చేయడం లేదని వాపోతున్నారు.

ఈ కార్యాలయంపై ఎసిబి నిఘా ?

ఈ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, మామూళ్ల వ్యవహారంపై ఎప్పటి నుంచో అవినీతి నిరోధక శాఖ అధికారులు నజర్ వేసినట్లు సమాచారం. కార్యాలయంలో నేరుగా డ బ్బులు తీసుకోకుండా దళారుల, పైరవీ కారుల స హాయంతో డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తోం ది. ఇప్పటికైనా ఈ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపైపై అధికారులు చర్యలు తీసుకొని పేద రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News