Sunday, April 28, 2024

రియా చక్రవర్తి వినతిని ఆమోదించిన కోర్టు

- Advertisement -
- Advertisement -

Rhea Chakrabarti
ముంబయి: హిందీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ధోనీ సినిమా ఫేమ్) హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి నుంచి మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్‌సిబి) గత ఏడాది ల్యాప్‌టాప్, ఫోన్‌లను స్వాధీనం చేసుకోవడమేకాక, ఆమె బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేసింది. దాంతో ఆమె వాటి కోసం ప్రత్యేక కోర్టులో వినతి చేసుకుంది. దాంతో ప్రత్యేక కోర్టు ఆమె వినతిని మన్నించి ఆమె బ్యాంకు ఖాతాలను, ఫిక్స్‌డ్ డిపాజిట్లను డీఫ్రీజ్ చేసింది.అది కూడా రాతపూర్వక కొన్ని షరతులపైన. ఆమెపైన, మరి 32 మంది ఇతరులపైన అభియోగాలు నమోదై ఉన్నాయి. వారి కేసు విచారణ ఇంకా జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అబ్దెల్ బాసిత్ పరిహార్ విదేశంలో ఉద్యోగం కోసం పయనించడానికి అనుమతి కోరగా కోర్టు ఇటీవల ఆమోదించింది. అయితే నాలుగు నెలలకోసారి కోర్టుకు హాజరు కావాలని షరతు పెట్టింది. సుశాంత్ రాజ్‌పుత్ కోసం మాదకద్రవ్యాలను తెప్పించిన కేసు రియాపై నమోదై ఉంది. బాంబే హైకోర్టు ఆమెకు 2020 అక్టోబర్‌లో బెయిల్ మంజూరుచేసింది. మాదకద్రవ్యాల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధంలేదని రియా చక్రవర్తి వాదిస్తోంది. తన పేరును ఉపయోగించుకుని మాదకద్రవ్యాలను ఎవరో పొంది ఉంటారని కూడా ఆమె వాదిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News