Sunday, April 28, 2024

9 రాష్ట్రాలలో పెరుగుతున్న కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -
Covid-19 cases on the rise in 9 states
కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన

న్యూఢిల్లీ: కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దేశంలోని తొమ్మిది రాష్ట్రాలలో వైరస్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్, వైద్య సదుపాయాలను పెంచడంతోపాటు సమర్ధవంతమైన చికిత్సా విధానాన్ని అమలు చేయడం తదితర చర్యలను చేపట్టాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం సూచించింది. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, కేరళ, మేఘాలయ, నాగాల్యాండ్, ఒడిశా, త్రిపుర, సిక్కిం రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఒక లేఖ రాశారు. అందులో ఆయా రాష్ట్రాలు తీసుకోవలసిన చర్యలను సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి సమష్టిగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో గడచిన నాలుగు వారాలుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని, గత వారం(జూన్ 28-జులై 4) పాజిటివ్ రేటు 16.2 శాతం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలోని 25 జిల్లాలకుగాను 19 జిల్లాలలో పాజిటివ్ కేసుల రేటు 10 శాతానికి మించి ఉండడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. కేరళలో కేసుల సంఖ్య తగ్గినప్పటికీ రెండు జిల్లాలలో మాత్రం గత నాలుగు వారాలుగా కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 14 జిల్లాలలో గత వారం రోజుకు 200 కేసులకు పైగా నమోదు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొల్లం, వయనాడ్ జిల్లాలలో గత వారం మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News