Thursday, May 2, 2024

2 లక్షలు దాటిన కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

Covid-19 death count crosses 2 lakh in India

 

ఒక్క రోజే 3,293 మంది మహమ్మారికి బలి
3,60,960 కొత్త కేసులు నమోదు
పది రాష్ట్రాల్లోనే 78 శాతం కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కేసులు మంగళవారం మళ్లీ రికార్డు స్థాయిలో పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు దేశంలో కరోనా విలయాన్ని కళ్లకు కడుతున్నాయి. దేశంలో తొలిసారి మరణాల సంఖ్య ప్రమాదకరస్థాయిలో 3 వేలను దాటింది. తాజాగా 3,293 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో మరణాల సంఖ్య 2 లక్షల (2,01,187)మార్కును దాటింది. వరల్డో మీటరు గణాంకాల ప్రకారం అమెరికా(5.87 లక్షలు), బ్రెజిల్ (3.95లక్షలు), మెక్సికో (2.15లక్షలు) దేశాలు సంఖ్యాపరంగా భారత్‌కన్నా ముందున్నాయి.

అలాగే మంగళవారం 17,23,912 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,60,960 కొత్త కేసులు వెలుగు చూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కు చేరింది.అలాగే కొవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 29,78,709కి చేరుకుంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల వాటా 16.34 శాతంగా ఉంది. ఇక మంగళవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 2.61 లక్షల మంది వైరస్‌నుంచి కోలుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక్కటే ఊరట కలిగించే అంశం. ఇప్పటివరకు కోటీ 48 లక్షల మందికి పైగా కోలుకోగా రికవరీ రేటు 82.33 శాతంగా ఉంది.

78 శాతం కేసులు ఆ రాష్ట్రాల్లోనే..

కాగా దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 78 శాతానికి పైగా కేసులు కేవలం పది రాష్ట్రాల్లోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, యుపి, కర్నాటక, చత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక్క రోజే 66,358 మంది మమహ్మారి బారిన పడగా, రికార్డు స్థాయిలో 895 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 32,921 కేసులు, కేరళలో గతంలో ఎన్నడూ లేని విధంగా 32,819 కేసులు వెలుగు చూశాయి. కాగా ఢిల్లీలో సైతం భారీగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే ఇక్కడ 381 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. యుపిలో 264, చత్తీస్‌గఢ్‌లో 246,కర్నాటకలో 180, గుజరాత్‌లో170, జార్ఖండ్‌లో 131,రాజస్థాన్‌లో 121, పంజాబ్‌లో 100 మంది చొప్పున వైరస్‌కు బలయ్యారు. మరోవైపు మంగళవారం దేశవ్యాప్తంగా 25లక్షల మందికి పైగా టీకాలు తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 15.69 కోట్ల టీకాలు ఇవ్వడం జరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News