Tuesday, May 14, 2024

ఏప్రిల్ మధ్యకల్లా ‘పీక్’కు కేసులు

- Advertisement -
- Advertisement -

COVID-19 second wave in India may peak by mid-April

 

మే చివరినాటికి తగ్గుముఖం
కరోనా సెకండ్ వేవ్‌పై గణితం ఆధారంగా శాస్త్రజ్ఞుల అంచనా

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సెకండ్ వేవ్ ఏప్రిల్ నెల మధ్యకల్లా తారస్థాయి( పీక్) చేరుకుంటుందని, ఆ తర్వాత మే చివరి నాటికి దాని ఉధృతి గణనీయంగా తగ్గవచ్చని ఒక గణిత విధానాన్ని ఉపయోగించి శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా కొవిడ్ తొలి వేవ్ సమయంలో కూడా ‘సూత్ర’అనే ఈ గణిత విధానం ఆధారంగా శాస్త్రజ్ఞులు ఆగస్టు మొదటి వారంలో ప్రారంభ దశలో ఉన్న కేసులు సెప్టెంబర్ నాటికల్లా పీక్‌కు చేరుకుని, ఆ తర్వాత 2021 ఫిబ్రవరి నాటికి తగ్గుముఖం పడతాయని అంచనా వేశారు. తాజాగా ఇప్పుడు పెరుగుతున్న రోజువారీ కేసుల సంఖ్య కూడా ఏప్రిల్ మధ్య నాటికి తారస్థాయికి చేరుకోవచ్చని ఇదే విధానాన్ని వర్తింపజేసిన శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు, ఐఐటి కాన్పూర్‌కు చెందిన మణింద్ర అగర్వాల్ కూడా ఈ శాస్త్రజ్ఞుల బృందంలో ఉన్నారు.‘

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఏప్రిల్ 15 20 మధ్య నాటికి పీక్‌కు చేరుకోవడానికి అవకాశాలున్నాయని గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కేసులను బట్టి మేము భావిస్తున్నాం. ఈ పెరుగుదల చాలా వేగంగా జరుగుతోంది. అయితే మే చివరి నాటికి అంతే వేగంగా కేసులు తగ్గుముఖం పట్టవచ్చు’ అని అగర్వాల్ పిటిఐతోఅన్నారు. కేసులు భారీగా పెరుగుతండడాన్నిబట్టి రోజువారీ కేసులు ఎప్పటికి పీక్‌కు చేరుకుంటాయో అంచనా వేయడం కష్టంగా ఉంది. ప్రస్తుతంం రోజుకు లక్ష కేసులకు చేరువవుతున్నాయి. ఇది ఇంకా పెరగనూ వచ్చు, తగ్గనూ వచ్చు.

అయితే టైమింగ్ మాత్రం మారదు అని ఆయన అన్నారు. అయితే వైరస్ ఉధృతిలో ఏ మాత్రం చిన్న మార్పు జరిగినా కేసుల సంఖ్యలో వేల తేడా ఉండవచ్చని ఆయన అంటూ అయితే ప్రస్తుత వైరస్ విజృంభణ పీక్‌కు చేరే సమయం మాత్రం ఏప్రిల్ మధ్యనుంచి మే మధ్యలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.స్వతంత్ర అధ్యయనం చేసిన హర్యానా అశోక యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి అంచనాలు స్వల్పకాలానికి మాత్రమే నమ్మదగినవిగా ఉంటాయని ‘సూత్ర’ మోడల్‌తో సంబంధం లేని మీనన్ అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News