Tuesday, May 7, 2024

కొవిడ్ రోగులకు సంజీవిని ‘టిమ్స్’

- Advertisement -
- Advertisement -

1261 పడకలు, 266 మంది దాక్టర్లు,535 ఇతర వైద్య సిబ్బందితో సేవలు
కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందంటున్న కోలుకున్న బాధితులు

మన తెలంగాణ/హైదరాబాద్ : కొవిడ్ రోగులకై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తెలంగాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసర్చ్ (టిమ్స్) నిరుపేదలనుండి ఉన్నతవర్గాలకు వరప్రసాదంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపుతో గత సంవత్సరం గచ్చిబౌలిలో అత్యుత్తమ వైద్య ప్రమాణాలతో ప్రారంభించిన ఈ 1261 పడకల కోవిద్ ఆసుపత్రి తెలంగాణ ప్రజానీకానికి సంజీవినిగా మారింది. ఈ 1261 పడకల్లో 980 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఏ ఇతర సూపర్ స్పెషాలిటీ ఆపత్రిలో లేనివిధంగా ఈ టిమ్స్ లో 137 మెకానికల్ వెంటిలేటర్లతో కూడిన ఐ.సి.యూ ల సౌకర్యం కూడా ఉంది. రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రుల మాదిరిగా ఈ 14 అంతస్తుల టిమ్స్ ఆసుపత్రిలో వార్డులు ఉండవు.

దీనిలో అన్నీ ప్రత్యేక రూమ్లే ఉంటాయి. ప్రతీ రూమ్ లో కేవలం ఇద్దరు కొవిడ్ పేషేంట్లను మాత్రమే ఉంచి చికిత్స అందిస్తారు. ప్రతీ బెడ్ కు లిక్విడ్ ఆక్సిజన్ సౌకర్యం కూడా ఉంది. ఈ ఆసుపత్రిలో ప్రత్యేకత ఏమంటే, 24 గంటలూ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడమే కాకుండా ప్రతీ రోజూ మూడు,నాలుగు సార్లు పేషంట్ల వద్దకు వచ్చి పరీక్షిస్తారు. డైటీషన్ల సూచించిన ప్రమాణాల మేరకు పేషంట్లకు నిర్ణీత సమయాల్లో ఆహారాన్ని అందిస్తారు. ఆసుపత్రి పరిశుభ్రతకు మరో పేరుగా నీట్‌గా ఉంచడంలో ఆసుపత్రి శానిటేషన్ సిబ్బం ది కృషి అమోఘం. అయితే, ఆహారం అందించే కాంట్రాక్టర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో ఆ కాంట్రాక్టర్ ను తప్పించి మే మొదటి వారంనుండి కొత్త కాంట్రాక్టర్ ను నియమించడంతో ప్రస్తుతం పేషంట్లకు మంచి ఆహరం కూడా లభిస్తోంది. అయితే, పేషంట్ల ఆరోగ్యం దృష్ట్యా ఇక్కడి పేషంట్ లు బయటినుండి ఆహారం తెచ్చుకోవడాన్ని నిషేదించారు.

సిబ్బంది ప్రత్యేక చొరవ

మందులు, చికిత్స, డాక్టర్లు, నర్సులు, ఇక్కడి కరోనా పేషంట్ల పట్ల చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ను కోలుకున్న బాధితులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా సకాలంలో మందులు అందించడం, ఎంతో ఓపిగ్గా సమస్యలు వినడం, వైద్యులు ఇతర మెడికల్ సిబ్బంది మధ్య మంచి సమన్వయము, మెరుగైన ఆహారం అందించడం వంటి సౌకర్యాలు అందించడం ఇక్కడి పేషంట్లకు మనోధైర్యం కలిగిస్తున్నాయి. ఈ టిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం 260 మంది డాక్టర్లు, 266 మంది నర్సులతో పాటు పేషంట్ కేర్ సిబ్బంది, తగు సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది, 266 పారా మెడికల్ సిబ్బంది, 130 మంది ఇతర సిబ్బంది కోవిద్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. వీరికి అదనంగా, మరో 190 మంది సిబ్బంది ని నియమించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే అనుమతులు జారీ చేసింది

ఇతర రాష్ట్రాల రోగులు వస్తున్నారు

టిమ్స్ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుంది. చాలా మంది ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి లక్షలాది రూపాయలు వ్యయం చేసి చివరి సమయంలో టిమ్స్ ఆసుపత్రి కి వస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ వారికి మంచి వైద్య సదుపాయాలూ అందచేసి పూర్తిగా నయం చేసి పంపిస్తున్నామని టిమ్స్ ఆసుపత్రి వైద్యులు అన్నారు. తెలంగాణా రాష్ట్రం నుంచి కాక మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ల నుంచి కూడా కొవిడ్ పేషెంట్లు టిమ్స్‌లో జాయినింగ్ కు వస్తున్నారు. ప్రతీ రోజూ కనీసం వంద మంది కోవిద్ పేషంట్లు చేరుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

డిశ్చార్జ్‌లు కూడా అదే స్థాయిలో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు అయితే, ఈ నెల రోజుల నుంచి ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్స పొంది నయం కాక చివరి నిమిషంలో టిమ్స్ లో చేరిన వారిలో మాత్రమే మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి ప్రస్తుతం 650 మందికి పైగా కొవిద్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరం లో గాంధీ, కింగ్ కోటి, నిమ్స్ లతోపాటు పలు ఆసుపత్రుల్లో కొవిడ్ పేషంట్లకు చికిత్స అందిస్తున్నప్పటికీ టిమ్స్‌లో చేరేందుకే పెద్ద ఎత్తున రోగులు ఆసక్తి చూపిస్తున్నారంటే ఈ ఆసుపత్రిలో లభిస్తున్న మెరుగైన వైద్య సేవలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చని డిఎంఇ డా రమేష్‌రెడ్డి అన్నారు.

ఫ్రీగా సర్వీస్ అందించడం అద్బుతం

నాకు వారం రోజు క్రితం పాజిటివ్ తేలింది. మా అక్క ద్వారా టిమ్స్‌లో చేరాను. ఇక్కడ సర్వీస్ చాల అద్బుతంగా ఉంది. కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందించడం గొప్ప విషయం. డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్ చాలా కేర్‌గా చూసుకుంటున్నారు. సమయానికి మంచి డైట్ ఇచ్చి ఆరోగ్యంగా తయారు చేస్తున్నారు.
కోలుకున్న బాధితురాలు మీనాక్షి

కంటికి రెప్పలా కాపాడుతున్నారు

కొవిడ్ సోకిన రోగులను టిమ్స్‌లో కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వాస్తవంగా మాది తమిళనాడు రాష్ట్రం. ఇక్కడ ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. పది రోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. స్నేహితుల సూచన మేరకు ఇక్కడ అడ్మిట్ అయ్యాను. ప్రభుత్వాసుపత్రిలో ఈ స్థాయిలో చికిత్స ఉంటుందని కలలో కూడా ఊహించలేదు. రోగులను కాపాడుతున్న డాక్టర్లు ఇతర స్టాఫ్, ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.

కోలుకున్న జైరామ్ రాజా

ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం

కరోనా రోగులను కాపాడేందుకు ఎంతో శ్రమిస్తున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని సౌకర్యాలను సమకూర్చుతున్నాం. ఈ సెకండ్ వేవ్‌లో పేషెంట్ల సంఖ్య అమాంతంగా పెరిగింది. అంతేగాక వారిలో వైరస్ లోడ్ కూడా కాస్త పెరిగింది. రాష్ట్రంలో అన్ని కొవిడ్ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నాం. కానీ కొంత మంది చివరి నిమిషంలో రావడం వలనే వారిని కాపాడలేకపోతున్నాము.
డిఎంఇ డా. రమేష్‌రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News