Wednesday, May 1, 2024

కొవిడ్ సంక్రమించిన మూన్నాళ్ల తరువాతనే లక్షణాలు

- Advertisement -
- Advertisement -
Covid Symptoms appear three days after infection
చైనాలో 9 వేల మందిపై నిర్వహించిన అధ్యయనం వెల్లడి

బీజింగ్ : రెండు రోజుల ముందుగానే వేగంగా కొవిడ్ సంక్రమించినప్పటికీ, మూడు రోజుల తరువాతనే లక్షణాలు బయటపడతాయని చైనాలో నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. కరోనా సోకిన మొదటి వ్యక్తి నుంచి వ్యాపించినప్పటికీ లక్షణాలు బయటపడవని అధ్యయనం పేర్కొంది. జర్నల్ జామా ఇంటర్నేషనల్‌లో ఈ పరిశోధన వెల్లడైంది. చైనా లోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో 2020 జనవరి నుంచి ఆగస్టు వరకు ప్రాథమిక కొవిడ్ కేసుల నుంచి సంక్రమించిన అతిసన్నిహితులైన దాదాపు 9000 మందిపై అధ్యయనం జరిగింది. అమెరికా లోని జార్జియా కాలేజి ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన యాంగ్ గేతో సహా పరిశోధక బృందం ఇన్‌ఫెక్సన్‌కు గురైన వారిని 90 రోజుల పాటు అధ్యయనం చేశారు.

ప్రాథమిక దశ లోని పరీక్ష ఫలితాల నుంచి లక్షణాలు బయటపడని అసింప్టమేటిక్ దశ , లక్షణాలు రాక ముందు దశను వేర్వేరుగా పోల్చి అధ్యయనం చేశారు. ప్రాథమిక కేసుల్లో గుర్తించిన వారిలో 89 శాతం స్వల్ప లేదా ఓ మోస్తరు లక్షణాలున్న కేసులుగాను, 11 శాతం మాత్రమే అసింప్టమేటిక్ కేసులని తేలింది. కుటుంబ సభ్యుల ప్రాథమిక దశ కేసుల్లో ఎవరైతే అనేక సార్లు లేదా సుదీర్ఘ కాల విరామంలో కొవిడ్ బాధితులవుతారో వారు సన్నిహితుల కన్నా అత్యంత ఇన్‌ఫెక్షన్‌కు గురవుతారని పరిశోధనలో తేలింది. స్వల్ప, లేదా ఓ మోస్తరు లక్షణాల వ్యక్తులతో పోల్చుకుంటే లక్షణాలు బయటపడని అసింప్టమెటిక్ ప్రాథమిక దశ లోని వ్యక్తుల తమ సన్నిహితులకు కొవిడ్‌ను సంక్రమింప చేయడం చాలా తక్కువగా ఉంటుందని పరిశోధనలో బయటపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News