Wednesday, May 1, 2024

సెకండ్ వేవ్ ముగిసి పోలేదు.. పండగల్లో జాగ్రత్తలు తప్పనిసరి: కేంద్రం

- Advertisement -
- Advertisement -

Covid Second wave not over yet says central

న్యూఢిల్లీ : సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అనేక పండగలు వస్తున్నందున కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని, కొవిడ్ నియంత్రణ నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ పంచగలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం గురువారం సూచించింది. దేశంలో కొవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం మీడియాతో మాట్లాడారు. మనం ఇంకా కరోనా సెకండ్ వేవ్ మధ్య లోనే కొనసాగుతున్నామని హెచ్చరించారు. ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బైరామ్ భార్గవ వ్యాక్సిన్లు వ్యాధి నుంచి రక్షణ కలిగిస్తాయే తప్ప నివారించలేవని, అందువల్ల మాస్క్‌ల వాడకం కొనసాగించడం ముఖ్యమని సూచించారు. ప్రతి పండగ తరువాత కరోనా కేసులు పెరుగుతుండడం అనుభవమేనని, దాన్ని దృష్టిలో పెట్టుకుని పండగల్లో జాగ్రత్తలు పాటించాలని భూషణ్ సూచించారు.

దేశం లోని 41 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉందని, దేశ వ్యాప్తంగా గత వారంలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల్లో 58.4 శాతం ఒక్క కేరళ లోనే నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం నమోదైన 46 వేల కొత్త కేసుల్లో దాదాపు 58 శాతం కేరళ లోనే వెలుగు చూసినట్టు రాజేష్ భూషణ్ వివరించారు. ప్రస్తుతం దేశంలో 3.33 లక్షల క్రియాశీల కేసులు ఉండగా, వాటిలో 1,70,829 ( 51,19 శాతం ) కేసులు కేరళ లోనే ఉన్నాయి. మహారాష్ట్రలో 53,695, కర్ణాటకలో 19,344 (5.8 శాతం ) తమిళనాడు లో 18,352 ( 5.5 శాతం), ఆంధ్రప్రదేశ్‌లో 14,001 (4. 21 శాతం ) గా ఉన్నట్టు వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో 10 వేలు నుంచి లక్ష మధ్య కేసులు ఉండగా, 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం 10 వేల కన్నా తక్కువ ఉన్నట్టు ప్రభుత్వం వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News