Thursday, August 7, 2025

రోడ్డు ప్రమాదంలో సిపిఐ నాయకుడు మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య (52) మృతి చెందినట్లు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొల్లోజు అయోధ్య మంగళవారం రాత్రి సూర్యాపేటలోని తన అల్లుడు ఇంటికి వచ్చి తిరిగి బుధవారం ఉదయం 5 గంటల సమయంలో తన కారు (టిఎస్ 29 టిఏ 1989)లో డ్రైవర్ రమేష్ తో కలసి బయలుదేరాడు. ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల వద్ద తన కారు ముందు వెళ్తున్న లారీ (ఏపి 39 వై 7788) డ్రైవర్ అజాగ్రత్తగా సడెన్‌గా బ్రేక్ వేయడంతో కారు లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. అయోధ్యకు బలమైన గాయాలు కాగా అక్కడికక్కమే మృతి చెందగా, కారు డ్రైవర్ రమేష్ గాయాలు అయ్యాయని, సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అయోధ్య అల్లుడు పోతుగంటి వీరాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News