Tuesday, May 21, 2024

బిజెపిని ఓడించడమే సిపిఐ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : దేశంలో ప్రజా సమస్యల పరిష్కరించలేని ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్న మతం పేరుతో కులం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బిజెపి, ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్‌ఐసి సింగరేణి బ్యాంకులు విశాఖ ఉక్కు ఓడరేవులు ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కారు చౌకగా ఆదాన్ని అంబానీ లకు కట్టబెడుతున్న మోడీని గద్దె దించడమే సిపిఐ లక్ష్యం అని అందుకోసం దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో బిజెపి హటావో దేశ్ కి బచావో కార్యక్రమం కొనసాగిస్తున్నామని ఇంకా అనేక మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమవుతున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

సత్తుపల్లి సత్తుపల్లి వచ్చిన ఆయన లాయర్ మల్లెపూల వెంకటేశ్వరరావు గృహంలో విలేకరులతో మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి ముప్పు ఏర్పడిందని, మతం పేరుతో మత ఉన్మాదం సృష్టిస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశం కోసం దేశ రక్షణ కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం లౌకిక వాద రక్షణ కోసం బిజెపిని ఓడించటం మా లక్ష్యం అన్నారు. పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడానికి పిలవకుండా రాష్ట్రపతిని అవమాన పరిచిన మోడీ సన్యాసులతో పార్లమెంట్ భవనం నింపారని విమర్శించారు.

రాష్ట్రంలో గవర్నర్ తమిళి సై బిజెపి నాయకురాలు లాగా వ్యవహరిస్తున్నారని ప్రజాదర్బార్లు పెట్టడం తన పరిధిని మించి పెత్తనం చెలాయించాలని ప్రయత్నం చేస్తున్నారని బిజెపిని వ్యతిరేకించే రాష్ట్రాల్లో గవర్నర్లను తమ తాబేదారులుగా వాడుకొని మోడీ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాలను అస్తిరితపరుస్తుందని అందులో భాగంగానే తెలంగాణలో కూడా గవర్నర్ అతిగా ప్రవర్తిస్తూ బిజెపి మోడీ చెప్పింది చేయటం కోసం ప్రయత్నిస్తుందని అట్టి చర్యలను భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని బ్రిటీష్ వదిలి వెళ్ళిన ఈ గవర్నర్ వ్యవస్థ అనేది దండగమారదని ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

గత కొద్ది రోజులుగా కెసిఆర్ బిజెపిపై చేస్తున్న పోరాటానికి కమ్యూనిస్టులుగా మునుగోడు ఎన్నికల్లో మద్దతు ఇచ్చామన్నారు. అదేవిధంగా కేంద్రంలో బిజెపిని ఓడించడానికి అన్ని శక్తులు ఏకమవుతున్నాయని అట్టి శక్తులతో కేసీఆర్ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఆంధ్రప్రదేశ్ ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సెల్సన్ రామారావు, సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ, ఏఐటీయూసీ నాయకులు నిమ్మటూరి రామకృష,్ణ సిపిఐ మండల కార్యదర్శి యోబు, అడ్వకేట్ మల్లెపూల వెంకటేశ్వ రావు లు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News