Tuesday, February 7, 2023

దేవతను తీసుకెళ్తుండగా కూలిన క్రేన్: నలుగురు మృతి

- Advertisement -

హైదరాబాద్: మండియమ్మ గుడిలో వేడుక జరుగుతుండగా దేవతను క్రేన్‌లో తీసుకెళ్తుండగా అది కుప్పకూలడంతో నలుగురు భక్తులు మృతి చెందిన సంఘటన తమిళనాడు రాష్ట్రం రానిపేట్ జిల్లా అరక్కొనమ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కిలివిడి ప్రాంతంలో మండియమ్మన్ గుడిలో దేవతను క్రేన్‌లో తీసుకెళ్తున్నారు. 1500 మంది భక్తులు దేవతను దర్శించుకోవడానికి వచ్చారు. క్రేన్ ఒక్కసారిగా ఒకవైపుకు ఒరిగిపడిపోయింది. ఆదివారం రాత్రి సమయంలో క్రేన్ కింద పడి నలుగురు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పునయ్ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి డ్రైవర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles