Tuesday, April 30, 2024

మహిళలపై వేధింపుల కేసులు 11 శాతం పెరిగాయి: మహేష్

- Advertisement -
- Advertisement -

Crime rate decreased in Rachakonda

హైదరాబాద్: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 12 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. 2020 వార్షిక నివేదికను విడుదల చేసిన సందర్భంగా మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. డయల్ 100కు వచ్చే ఫోన్ కాల్స్‌కు వేగంగా స్పందిస్తున్నామన్నారు. రాచకొండ ఐటి సెల్ కానిస్టేబుల్‌కు జాతీయ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. దోపిడీలు, దొంగతనాలు కేసుల్లో 53 శాతం రికవరీ పెరిగిందని, మహిళలపై వేధింపుల కేసులు 11 శాతం పెరిగాయని, రాచకొండ పరిధిలో 41 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేశామని వెల్లడించారు. 202 ఎక్సైజ్ కేసులు, 105 అక్రమంగా పిడిఎస్ రైస్ తరలింపు కేసులు, 704 సైబర్ క్రైమ్ కేసులు, 49026 సోషల్ మీడియా కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో 11892 సిసి కెమెరాలు ఏర్పాట చేశామని భగవత్ వెల్లడించారు. ఈ ఏడాది షీ టీమ్స్ 332 కేసులు నమోదు చేయగా బాల్య వివాహాలు 92, ఆపరేషన్ ముస్కాన్ కింద 259 మంది పిల్లలను కాపాడామని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 3203 కేసులు, ఇందులో 324 మందికి జైలు శిక్ష వేశామని భగవత్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News