Thursday, June 13, 2024

బ్యాలెట్ బాక్స్‌ల్లో తీర్పు పట్టభద్రం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వరంగల్-నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్‌సి ఉపఎన్నిక పో లింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ప్రా ధాన్యతా క్రమంలో ఓటు వేయాల్సి ఉన్నందున బ్యాలెట్ పద్ధతిలో ఓటర్లు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు మొదలవగా, 10 గంటల వరకు 11.34 శాతం పోలింగ్ నమో దు కాగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30 శాతం నమోదయ్యింది. మధ్యాహ్నం 2 గంటల వ రకు 49.53 శాతం పోలింగ్ నమోదు కాగా, సా యంత్రం 4 గంటల వరకు 68.65 శాతం పోలిం గ్ జరిగింది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ గ డువు ముగియగా, అప్పటి వరకు కేంద్రాలకు చే రుకున్న వారందరికీ అధికారులు ఓటేసే అవకా శం కల్పించారు. చెదురుమదురు ఘటనలు మిన హా ఎలాంటి గొడవలకు అవకాశం లేకుండా పో లింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ము లుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ,సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా ల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో ఉపఎన్నిక జరిగింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, సిద్దిపేటలో అతితక్కువగా 5 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది.

ఓటేసిన ప్రముఖులు
ప్రాధాన్యతా ఓటు పద్ధతి అయినందున బ్యాలెట్ విధానంలో ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించారు. గతంలో చెల్లని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటం తో, ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు ముందుగానే వివరించి, అవగాహన కల్పించారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పల్లా రా జేశ్వర్‌రెడ్డి జనగామలో తరువాయి 6లో
ఓటు వేయగా, ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి హనుమకొండలో, పాలకుర్తి ఎం ఎల్‌ఎ యశస్వినీరెడ్డి తొర్రూరులో ఓటు హక్కు వి నియోగించుకున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, నల్గొండలో కలెక్టర్ చందన, ఇతర అధికారులు ఓటు వేశారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, హన్మకొండలో బిఆర్‌ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి, వరంగల్ కాశీబుగ్గలోని వివేకానంద కళాశాలలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ఓటేశారు.

బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన పట్టభద్రుల తీర్పు
వరంగల్- నల్గొండ- ఖమ్మం శాసనమండలి నియోజకవర్గ పట్టభద్రుల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. 2021లో జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎంఎల్‌ఎగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేయడంతో పట్టభద్రుల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, గులాబీ పార్టీ ఎంఎల్‌సి అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి, బిజెపి అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు.

పలుచోట్ల చెదురుమదురు ఘటనలు
ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తిలోని 28వ పోలింగ్ బూత్ బ్యాలెట్ పేపర్ ముద్రణ సరిగ్గా లేదంటూ 45 మంది ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేయగా, అధికారులు సమస్య పరిష్కరించారు. వరంగల్ ఏవీవీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద టెంట్లు తొలగించటంపై బిజెపి, బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ తరహా మినహాయిస్తే మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మద్యం దుకాణాలు మూసివేసి, కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పార్టీలు ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగకుండా భారీ బందోబస్తు, నిఘానేత్రాల పర్యవేక్షణతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ పూర్తిచేశారు.

బ్యాలెట్ బాక్స్‌లను భారీభద్రత మధ్య స్ట్రాంగ్‌రూంలకు అధికారులకు తరలించారు. మరోవైపు ఎన్నికల్లో డబ్బుల పంపిణీ గురించి ప్రశ్నించిన తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని ఎంఎల్‌సి స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఆరోపించారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో హస్తం పార్టీ శ్రేణులు చేస్తున్న నగదు పంపిణీని తాను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా, వారు దానిని ధ్వంసం చేసి తనను విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు. ఈ మేరకు ఆయన నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు సైతం అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని అశోక్ ఆరోపణలు చేశారు.

5న ఎంఎల్‌సి ఓట్ల లెక్కింపు
రాష్ట్రంలో పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానానికి జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. సోమవారం ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News