Wednesday, May 1, 2024

పంట నమోదు త్వరగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

వరంగల్ :పంటల వారీగా పంట నమోదు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య వ్యవసాయాధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖలకు చెందిన సహాయ సంచాలకులు, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, విస్తరణ అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ గూగుల్ మీట్ నిర్వహించారు. విత్తన దుకాణాల తనిఖీలు, నమోదు చేసిన కేసు వివరాలను తీసుకున్న చర్యల గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేరుగా వరి విత్తే విధానాన్ని అధికారులు ప్రోత్సహించాలన్నారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలన్నారు. అన్ని పంటల విత్తనాలను డీలర్ షాపుల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఎరువుల ప్రస్తుత నిలువలను బట్టి మండలాల వారీగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందస్తుగా నిల్వలు చేసుకోవాలని సూచించారు.

ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే ఎరువుల అమ్మకాలు జరిగేలా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అమ్మకాల క్లియరెన్స్ ఎప్పటికప్పుడు చూసుకోవాలని ఆదేశించారు. నిర్ధేశించిన లక్షాల ప్రకారం ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షకు పంపాలన్నారు. రైతు బీమా 2023…24 సంవత్సరానికి సంబంధించి మాట్లాడుతూ 1964 ఆగస్టు 14 నుండి 2005 ఆగస్టు 14 మధ్యలో జన్మించిన అర్హులైన రైతులందరిని బీమా క్రిందకు తీసుకురావాలని సూచించారు. మరణించిన రైతుల వివరాలను ఎలాంటి జాప్యం లేకుండా బీమా కంపెనీలకు పంపాలన్నారు. పిఎం కిసాన్‌కు సంబంధించి ఇంకా ఈ కెవైసి చేయించుకోని రైతులను గుర్తించి ఫెసియల్ యాప్ ద్వారా ఈ కేవైసి చేయించాలని ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకణాలను 100 శాతం తనిఖీ చేసి అక్రమాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News