Sunday, April 28, 2024

సత్తుపల్లి, బోనకల్‌లో అన్ని ఎస్‌సి కుటుంబాలకు ‘దళితబంధు’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, బోనకల్లు మండలాల్లో ఉన్న అన్ని ఎస్‌సి కు టుంబాలకు దళితబంధు వర్తింప జేయాలని ప్రభుత్వ జి వో శనివారం విడుదలైంది. తక్షణమే ఈ జివొ అమల్లోకి రానుంది. తెలంగాణలోని ఎస్‌సిలు స్వతంత్రంగా ఎదగాలనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ దళిత బంధు ప్రవేశపెట్టారు.

సత్తుపల్లి, బోనకల్లు మండలాల్లో ఉన్న అన్ని ఎస్‌సి కుటుంబాలకు దళితబంధు ఇవ్వాలని ఎంఎల్‌ఎ సండ్ర వెంకట వీరయ్య, జెడ్‌పి చైర్మన్ లింగాల కనకరాజ్ మం త్రి కెటిఆర్‌ను అడిగారు. ఈ విషయమై తాను సిఎం కెసిఆర్‌తో మాట్లాడానని, సత్తుపల్లి, బోనకల్లులోని అన్ని ఎస్‌సి కుటుంబాలకు దళితబంధు వెంటనే మంజూరు చేస్తామని మాట ఇచ్చినట్లు కెటిఆర్ వివరించారు. ఈ రెండు మండలాల్లో దళితబంధు లబ్దిదారులను గుర్తించాలని కూడా అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా పర్య టనలో భాగంగా సత్తుపల్లిలో జరిగిన ప్రగతి నివేదన సభలో మంత్రి కెటిఆర్ పాల్గొని దళితబంధు అమలు చేసి తీరుతామని ప్రకటించారు. మంత్రి ప్రకటించిన కొద్ది వ్యవధిలోనే ప్ర భుత్వం సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, బోనకల్లు మండలాల్లో అన్ని ఎస్‌సి కుటుంబాలకు దళితబంధు వర్తింపజేయాలని ప్రభుత్వ జివో విడుదల కావడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News